Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహమ్మారి ప్రారంభమైన సంవత్సరాల నుంచి స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు మరియు హియరబుల్స్‌తో పాటు ఇతర ‘ఆన్-ది-గో డివైజ్‌లు’ ఉన్న వినియోగదారులలో లీనమయ్యేలా చేసే ధ్వని అనుభవాలు ప్రాముఖ్యత పొందుతున్నాయి. డిజిటల్ నేటివ్లలో టెక్-అవేర్ వినియోగదారులు కంటెంట్ వినియోగానికి >20 గంటలను ఆన్లైన్లో గడుపుతుండగా గత మూడేళ్లలో 11% మంది ప్రీమియం ప్రాంతీయ ఆడియోలలో పరిణామకారి రెండంకెల ప్రగతి కనిపిస్తుంది. ఈ అధ్యయనం లోపలి అంశాలు డాల్బి నియమించిన ‘స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ధ్వని ప్రాముఖ్యత’కు సంబంధించి విస్తృత వినియోగదారుల అధ్యయన మూడవ ఎడిషన్ నుంచి తీసుకోగా కంటెంట్ సృష్టి చుట్టూ వినియోగదారుల ప్రవర్తన మరియు చలనంలో వినియోగించే పరికరాల క్రియాశీలతలో మార్పులు నమోదవుతున్నాయి. అధ్యయనంలో గుర్తించినటువంటి ధ్వని నాణ్యత అత్యంత ప్రముఖ చోదక శక్తికాగా (100లో 71) వినియోగదారుల స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపిస్తుండగా, బ్యాటరీ (100లో 67) మరియు కెమెరా (100లో 71) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. తన సేవలను 2020లో ప్రారంభించిన తర్వాత సిఎంఆర్ సమీక్షలో ధ్వని ప్రముఖమైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చోదక శక్తి అనేది వరుసగా ప్రాధాన్యత ఇస్తున్నారని తేటతెల్లమైంది. ధ్వని నాణ్యత ప్రాముఖ్యత అంశం 2020 మరియు 2022 మధ్య 8% వృద్ధి చెందింది. సిఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూపు అధికారి ప్రభు రామ్ మాట్లాడుతూ, ‘‘సంగీతం, సినిమాలు, క్రీడల ప్రత్యక్ష ప్రసారాలు మరియు మొబైల్ గేమింగ్ ఇలా వినియోగపు సందర్భాల శ్రేణి నుంచి ప్రేరణతో అగ్రగామి ధ్వని అనుభవాలను వినియోగదారులు ఎక్కువగా కేవలం స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఇతర ఆన్-ది-గో పరికరాల్లోనూ నిరీక్షిస్తారు. స్టేషియల్ ఆడియోకు వృద్ధి చెందుతున్న డిమాండ్‌తో వినియోగదారులు ఇప్పుడు ఎక్కువగా తమ కంటెంట్ అనుభవాల నుంచి లోతైన మరియు డిటెయిల్‌ను నిరీక్షిస్తున్నారు. వీటిని డాల్బి అట్మాస్ మరియు డాల్బి విజన్ వంటి వ్యాపారంలో అగ్రగామి ఆవిష్కారణలతో సాధ్యమైంది’’ అని వివరించారు.
అధ్యయనంలోని ప్రముఖ అంశాలు ఇక్కడ ఉన్నాయి:
ఉన్నతీకరించిన ధ్వని నాణ్యత ఆన్-ది-గో పరికరాల్లో అత్యంత ప్రముఖ, అత్యంత అవసరమైన ప్రత్యేకత ఆన్-ది-గో పరికరాలలో ధ్వని నాణ్యత అత్యంత ప్రముఖ కొనుగోలు చోదక శక్తి. సంగీతం ఆలకించడం, సినిమా వీక్షణ మరియు ఓటీటీ వీక్షణ వినియోగదారులు తమ ఆడియో/ వీడియోలను స్మార్ట్ఫోన్లలో వినియోగించే మూడు ప్రముఖ ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ అధ్యయనం ఆడియో కాల్స్‌కు వాట్సప్‌లో 41% వృద్ధి చూపించగా, 2020లో కేవలం 38% ఉండగా 2022లో 79% ఉంది.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ఆడియో బుక్‌లలో ఆలకించడం గమనార్హంగా వృద్ధి చెందగా, అది ప్రగతి సాధించి 25 నుంచి 30 ఏళ్ల వినియోగదారుల నుంచి ప్రేరితమైంది. ధ్వని లేదా దృశ్యం కంటెంట్ వినియోగంలో వైర్లెస్ హెడ్ఫోన్లు అత్యంత ప్రాధాన్యత స్మార్ట్‌ఫోన్ యాక్ససరీలుగా కొనసాగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ యాక్ససరీల వినియోగం 2021లో వృద్ధి చెందగా, దానికి ఈ ఏడాది ఎక్కువ వాయిస్ క్లారిటీ (64%)కి వినియోగదారులు మొగ్గు చూపడం కారణం.
కంటెంట్ క్రియేటర్లు పెరిగారు
గత మూడేళ్ల నుంచి వీడియోలు మరియు ఆడియో కంటెంట్ సృష్టి అవధి 10% వద్ధి చెందింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సగటున వారానికి 5 నుంచి 5 గంటలు కంటెంట్ సృష్టించేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు.
ప్రతి ఐదుగురు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో నలుగురు డాల్బి విజన్ కలిగిన స్మార్ట్ఫోన్ల నుంచి ఎక్కువ వీడియోల చిత్రీకరణలో ఆసక్తి చూపించారు. డాల్బి అట్మాస్ మరియు డాల్బి విజన్ వినియోగదారుల క్రియాశీలత నేతృత్వం వహిస్తుంది. ప్రతి ఆరుగురు వినియోగదారులలో ఐదుగురు (84%) డాల్బి అట్మాస్‌లో కంటెంట్ వినియోగించినప్పుడు ఉత్తమ తరహాలో కంటెంట్‌కు అనుసంధానం అయిన భావన కలిగిందని తెలిపారు. ఇది 2021లో 5% మేర వృద్ధి చెందగా, దానికి డాల్బి అట్మాస్‌లో లభించే పలు ఆయామాల శబ్దపు అనుభవమే కారణం.
ప్రతి ఆరుగురు వినియోగదారులలో ఐదుగురు (84%) డాల్బి అట్మాస్/డాల్బి విజన్ గత మూడేళ్లలో వారి మొబైల్ కంటెంట్ వినియోగం వృద్ధి చెందేందుకు ఆఫర్ ఇచ్చిందని భావించారు. చలన చిత్రాలు, సంగీతం మరియు ఎపిసోడ్ల కంటెంట్‌తో సహా వినియోగదారులు అగ్రగామి మూడు కంటెంట్లను డాల్బి అట్మాస్, డాల్బి విజన్‌లో అనుభవాన్ని పొందాలని కోరుకుంటున్నారు. వాస్తవంగా గత మూడేళ్లలో నిర్వహించిన అధ్యయనం లోపలి అంశాల ప్రకారం సినిమాలు భారతీయులను ఎక్కువ రంజిపజేస్తున్నాయి. ఎనిమిదిలో ఏడుగురు వినియోగదారులు డాల్బి అట్మాస్/డాల్బి విజన్ వారి కంటెంట్ చందా ప్లాన్లకు ఆఫర్ ఇస్తోందని విశ్వసిస్తున్నారు.
సంపాదకులకు సూచన
సైబర్ మీడియా రీసర్చ్ (CMR) అగ్రగామి సాంకేతికత పరిశోధన మరియు కన్సల్టింగ్ కంపెనీ కాగా, ‘‘ఆడియో అండ్ వీడియో కన్సమ్షన్ ఆన్ ‘ఆన్ ది గో డివైజెస్’ ఇండియా’ అనే టైటిల్‌తో సమీక్ష తృతీయ ఎడిషన్ ఆవిష్కరించింది. ఈ అధ్యయనానికి 18 నుంచి 40 ఏళ్ల వయసున్న ఎ మరియు బి వర్గాలకు చెందిన 2,344 మంది వినియోగదారులు స్పందించారు. ఈ అధ్యయనాన్ని టైయర్ 1 మరియు టైయర్ 2 నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్కత్తా, బెంగళూరు, మధురై, రాజ్‌కోట్, భువనేశ్వర్ మరియు జలంధర్లలో నిర్వహించారు. ఈ పరిమాణంలో యాదృచ్ఛిక సమీక్ష ఫలితాంశాలలో పూర్తి జనాభాను సమీక్షించినప్పుడు 3% మేర ఎక్కువ లేదా తక్కువ ఉండే అవకాశం ఉండగా, 95% మేర గణాంకాలు కచ్చితత్వాన్ని కలిగి ఉన్నాయి.