Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యునైటెడ్ ఫర్నీచర్స్ 2700 మందికి ఉద్వాసన
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ప్రభావం తీవ్ర మవుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి టెక్, రిటైల్ కంపెనీలు తమ ఉద్యోగు లను భారీగా తొలగిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. తాజాగా అమెరికాలోని మిస్పిస్సిప్పిలో రెండు దశాబ్దాల నుంచి ఫర్నీచర్ తయారీలో ఉన్న యునై టెడ్ ఫర్నీచర్ ఇండిస్టీస్ (యూఎఫ్ఐ) ఏకంగా 2,700 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. రేపటి నుంచే పనుల్లోకి రావొద్దని సూచిస్తూ ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా ఒక్క పూట ముందే సమాచారం ఇచ్చింది. మీమ్మల్ని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నామని.. సంస్థ అందిం చే అన్ని సౌకర్యాలు రద్దయ్యాయని మరో మెయిల్లో సమాచారం ఇచ్చింది.