Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత వృద్థి రేటు అంచనాలకు గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీలు, అంతర్జాతీయ సంస్థలు వరుసగా కోత పెడుతున్నాయి. తాజాగా స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్అండ్పీ) ఇంతక్రితం వేసిన అంచనాలకు మరో 30 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత జిడిపి 7 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 7.3 శాతగా ఉంది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టి 6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. 2022 డిసెంబర్ ముగింపు వరకు కూడా భారత వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 6 శాతం ఎగువనే చోటు చేసుకోవచ్చని తెలిపింది.