Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: మాంసం. సము ద్రపు ఉత్పత్తులను విక్రయించే డీ2సీ బ్రాండ్ యునికార్న్ లిషియస్ తన వినియోగదారులకు మరింత చేరువ కాడానికి ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో భాగస్వామ్యం కుదుర్చు కుంది. ఈ సంస్థ ఉత్పత్తులకు ఎన్టీఆర్ ప్రచారం చేయనున్నారు. ''ఈ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ జూనియర్ ఎన్‌టిఆర్‌తో భాగస్వామి కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన పేరు మాస్‌తో ప్రతిధ్వనించే, నిరాడంబరమైన ఆకర్షణ. నఖ్రాస్ ఖర్చుతో కూడుకున్నప్పటికీ, ఉత్తమమైన నాణ్యమైన మాంసాన్ని అందించేందుకు మా సిబ్బంది, అంకితభావానికి సంబంధించిన వివరాలను ఈ క్యాంపెయిన్ వివరిస్తాం.'' అని లిషియస్ బ్రాండ్ ఉపాధ్యక్షుడు సంతోష్ హెగ్డే పేర్కొన్నారు.