Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ట్విట్టర్‌కు చెందిన ఖాతాదారుల వివరాలను తస్కరించి ఆ సంస్థ చీఫ్ ఎలన్ మస్క్‌కు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. దాదాపుగా 50.4 లక్షల మంది ఖాతాదారుల సమాచా రాన్ని హ్యాకర్లు అమ్మకానికి పెట్టారని బ్లీపింగ్ కంప్యూటర్ వెబ్సైట్ ఓ రిపోర్టులో వెల్లడించింది. ఇంటర్నెట్ బగ్ సాయంతో డేటాను దొంగిలించారు. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా మరో 10 లక్షల మంది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను దొంగ లించారు.ట్విటర్ ఐడిలు, ప్రాంతాలు, పేర్లు, లాగిన్ పేర్లు లాంటి సమాచారంతో పాటు, ఫోన్ నంబర్లు, ఇమెయిల్ అడ్రస్‌లు సహా ఇతర ప్రయివేటు డేటాను హ్యాకర్లు కొట్టేశారు. ఈ వివరాలను హ్యాకర్వన్బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అనే ఆన్లైన్ వేదికలో అమ్మకానికి పెట్టారు. 2021 డిసెంబర్లో డేటాను కాజేశారని బ్లీపింగ్ కంప్యూటర్ నివేదిక వెల్లడించింది. 'అమెరికా, యూరప్ దేశాలకు చెందిన ట్విట్టర్ ఖాతాదారుల డేటా దొంగలించడం గురించి నేను ఈ మధ్య గమనించాను. హ్యాకర్ల బారిన పడిన కొందరు ఖాతాదారులతో మాట్లాడాను. తమ వివరాలను హ్యాకర్లు కాజేశారని వాళ్లు చెప్పారు.' అని ట్విట్టర్ సెక్యూరిటీ నిపుణుడు చాడ్ లోడర్ ముందుగానే హెచ్చరించారు. దీన్ని పట్టించుకోని ట్విట్టర్ యాజమాన్యం పైగా లోడర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఆందోళనకరం. డేటా తస్కరణపై ట్విట్టర్ చీఫ్ ఎలన్ మస్క్ స్పందించలేదు.