Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అర్హుడిగా ప్రకటించే అంశంపై నోటీసులు జారీ చేయాలని కోరుతూ టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. రాజాసింగ్ పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ లో కోరారు. ఎమ్మెల్యేగా ఆయనకు ఇంకా ఏడాది కాలం ఉందని, అందువల్ల అనర్హత వేటు వేయాలని ప్రేమ్ సింగ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాన జాతకచక్రాల ప్రకారం అన్ని గ్రహాలు కలిసి ఈ కేసును వినాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయని చెప్పింది. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.