Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశం, దేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న కారు తయారీదారులలో ఒకటి, తమ ధృవీకరించబడిన ప్రీ-ఓన్డ్ కార్ వ్యాపారం 'కియా సీపీఓ' ఆరంభాన్ని తమ కస్టమర్స్ కోసం ప్రకటించింది. ప్రత్యేకమైన కియా సీపీఓ అవుట్ లెట్స్ తో, కంపెనీ కొత్త కారును కొనుగోలు చేసే అనుభవానికి అనుగుణంగా కస్టమర్స్ కు ఆధునిక కాలం అనుభవాన్ని అందించడానికి ఉద్దేశ్యించింది, ఇది కస్టమర్స్ ప్రీ-ఓన్డ్ కార్స్ ను విక్రయించడానికి, కొనడానికి లేదా ఎక్స్ ఛేంజ్ చేయడానికి అవకాశం ఇస్తుంది, ఇబ్బందిరహితమైన యాజమాన్యం బదిలీలు మరియ అనుకూలమైన ఫైనాన్స్ ఆప్షన్స్ యొక్క మద్దతు కూడా లభిస్తుంది. దేశంలో సేల్స్ కార్యకలాపాలను ఆరంభించిన నాటి నుండి కేవలం మూడేళ్లల్లోనే ధృవీకరించబడిన ప్రీ-ఓన్డ్ కార్ వ్యాపారాన్ని ఆరంభించడం, ఆ విధంగా చేయడానికి కియాను అత్యంత వేగవంతమైన ఓఈఎంలలో ఒకటిగా చేసింది. పరిశ్రమలో తొలి ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ, కియా ఇండియా ప్రీ-ఓన్డ్ కార్స్ పై పరిశ్రమలో మొట్ట మొదటి & ఉత్తమమైన నిర్వహణా కార్యక్రమంతో పాటు పరిశ్రమలో ఉత్తమమైన వారంటీ కవరేజ్ ను కూడా అందిస్తుంది. కియా సీపీఓ ద్వారా విక్రయించబడిన కార్స్ :
2 సంవత్సరాలు వరకు & 40,000 కిమీ వారంటీ కవరేజ్ ను పొందుతాయి
4 వరకు ఉచిత క్రమానుగత నిర్వహణను పొందుతాయి
మ్యూంగ్-సిక్ సోహన్, ప్రధాన సేల్స్ అధికారి, కియా ఇండియా ఇలా అన్నారు, " కియా సీపీఓతో, ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్ కోసం మేము నియమాలను పునఃలిఖించాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం, ప్రీ-ఓన్డ్ కారు విభాగం విషయంలో భారతదేశపు కస్టమర్స్కు ధృవీకరించబడిన మరియు తనిఖీ చేయబడిన సమాచారం పరిమితంగా అందుబాటులో ఉంది మరియు వ్యాపారంలోకి మేము ప్రవేశించడం ద్వారా ఈ భావనను మార్చాలని ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నాము. పరిశ్రమలో ఉన్న అవసరమైన లోటును గుర్తించడం ద్వారా ప్రయాణాన్ని విప్లవీకరించడానికి మరియు మా గొప్ప ఉత్పత్తులు మరియు సేవలతో వాటిని నెరవేర్చడానికి కియా కృషి చేస్తోంది. దేశంలో మా ఉనికికి అత్యంత ఆరంభ దశలో సీపీఓ వ్యాపారం ఆరంభించడానికి మా ముందస్తు విధానం సగటు మార్పు కాలం క్రిందకు మా మొదటి విడత ఉత్పత్తులు రావడానికి ముందే అన్ని వ్యవస్థలు మరియు ప్రక్రియలు అమలులో ఉండేలా నిర్థారిస్తుంది."
ఆయన ఇలా అన్నారు, "కొత్త కియా కార్స్ యొక్క మూడొంతులు కంటే ఎక్కువమంది కస్టమర్స్ రీప్లేస్మెంట్ బయ్యర్స్ గా ఉన్నారు, మా ధృవీకరించబడిన ప్రీ-ఓన్డ్ కార్ వ్యాపారం ద్వారా మేము వారిని సమన్వయం చేయాలని లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. కస్టమర్స్ కొత్త కియా కార్స్ తో ఏదైనా యూజ్డ్ కార్ ను ఎక్స్ ఛేంజ్ చేయవచ్చు మరియు సురక్షితమైన మరియు తక్షణ చెల్లింపు బదిలీ ఆప్షన్ తో కంబైన్డ్ ప్యాకేజ్డ్ ఒప్పందాన్ని కూడా ఎక్స్ ఛేంజ్ కోరుకునే కస్టమర్స్ కు అందిస్తున్నాము."
కియా సీపీఓ ద్వారా, కియా ఇండియా తమ కార్స్ కోసం సరైన ధరను అందించడానికి తగిన, నిజాయితీతో కూడిన మరియు శీఘ్రమైన డిజిటల్ అంచనా ప్రక్రియను అనుసరించడం ద్వారా కస్టమర్స్ కు అమోఘమైన సేవలను అందిచే లక్ష్యాన్ని కలిగి ఉంది. కంపెనీ వాస్తవిక సమయం డేటా సమీకృతం & శాస్త్రీయమైన ధరల సూచనతో పరిశ్రమలో ఉత్తమమైన డిజిటల్ అంచనా మొబైల్ అప్లికేషన్ ను కూడా పరిచయం చేసింది. కియా సీపీఓ ద్వారా ధృవీకరించబడి మరియు విక్రయించబడిన అన్ని కియా కార్స్ కు 5 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు, 1 లక్ష కిమీ మైలేజీ ఉంటాయి మరియు కస్టమర్స్ కు లభించడానికి ముందు సమగ్రమైన 175 పాయింట్స్ నాణ్యతా తనిఖీలకు గురవుతాయి. ఈ కార్స్ కు నిర్మాణపరమైన హాని ఉండదు, ధృవీకరించబడిన యాజమాన్యం మరియు సేవా చరిత్రలు ఉంటాయి, కియా అసలైన భాగాలతో మాత్రమే నవీకరించబడతాయి.
కియా సీపీఓ అనేది కస్టమర్స్ కోసం అన్నీ ఒకే చోట లభించే వేదిక, మనశ్సాంతి మరియు కియా ప్రపంచంలోకి సులభంగా ప్రవేశించడాన్ని నిర్థారిస్తాయి. యథాతస్థ స్థితి ఆధారంగా కియా కాని కార్స్ కూడా కస్టమర్స్ కు లభిస్తాయి.
2022 చివరి నాటికి 30+ అవుట్లెట్స్ తో దేశంలో సీపీఓ వ్యాపారాన్ని పెంచడానికి కియా విస్త్రతమైన ప్రణాళికలు చేస్తోంది. ఇది ఇప్పటికే 14 పట్టణాలలో 15 అవుట్ లెట్స్ ను ఢిల్లీ, ఎన్ సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, ఛంఢీఘర్, జైపూర్, కొచ్చిన్, భువనేశ్వర్, కాలికట్, అమృత్ సర్, నాసిక్, బరోడా, కన్నూర్ & మలప్పురంలలో స్థాపించింది.