Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్‌ఫ్రాన్సిస్కో : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో జరుగుతున్న అనూహ్యా పరిణామాలను చూసి ఆపిల్ తన ప్రకటనలను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ట్విట్టర్‌కు ఆపిల్ ప్రకటనలు నిలిపివేసిన విషయాన్ని మస్క్ నిర్ధారిస్తూ ట్వీట్ కూడా చేశారు. అదే విధంగా ఆపిల్ తన యాప్ స్టోర్ నుంచి ట్విటర్‌ను తొలగిస్తామని కూడా బెదిరిస్తోందని పేర్కొన్నారు. ఈ దాడి తన టెస్లాపై కూడా కొనసాగుతుందా అని మస్క్ ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశారు. ట్విటర్‌కు ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయంలో ఆపిల్‌దే అధిక భాగం కావడం విశేషం. ప్రతీ ఏడాది దాదాపు 100 మిలియన్ డాలర్ల (రూ.817 కోట్లు) పైనే ఖర్చు చేస్తోందని సమాచారం.