Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కార్ల తయారీదారు కియా కొత్తగా ప్రీ-ఓన్డ్ కార్ల వ్యాపారం 'కియా సీపీఓ'ను ప్రారంభించినట్టు ప్రకటించింది. ప్రత్యేకమైన కియా సీపీఓ అవుట్‌లెట్లలో ప్రీ-ఓన్డ్ కార్లను విక్రయించడం, కొనుగోలు చేయడం, ఎక్సేంజీ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపింది. 2022 చివరి నాటికి వీటిని 30 అవుట్‌లెట్లకు విస్తరించనున్నట్లు కియా ఇండియా ప్రధాన సేల్స్ అధికారి మ్యూంగ్ సిక్ సోహన్ తెలిపారు. కొత్త కియా కార్స్ యొక్క మూడొంతులు కంటే ఎక్కువమంది వినియోగదారులు రీప్లేస్మెంట్ బయ్యర్స్‌గా ఉన్నారన్నారు. ఈ రంగంలో విస్తృతావకాశాలున్నాయని తాము గుర్తించామన్నారు. తొలుత హైదరాబాద్ సహా 14 పట్టణల్లో 15 అవుట్‌లెట్లను తెరిచినట్టు ఆ సంస్థ వెల్లడించింది.