Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశపు అతి పెద్ద వినియోగదారులు ఎలక్ట్రానిక్ బ్రాండ్ సామ్సంగ్, భారతదేశవ్యాప్తంగా, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్ బెంగుళూరు, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్ నోయిడా, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్ ఢిల్లీ మరియు బెంగుళూరులోని సామ్సంగ్ సెమీకండక్టర్ ఇండియా రీసెర్చ్ సంస్థలతో సహా తన R&D సంస్థల కోసం దాదాపు 1,000 ఇంజనీర్లను భర్తీ చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. 2023లో ఈ యువ ఇంజనీర్లు పనిలో చేరి, కృత్రిమ మేథస్సు, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రొసెసింగ్, IoT, కనెక్టవిటీ, క్లౌడ్, బిగ్ డాటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ అనాలసిస్, కమ్యూనికేషన్ నెట్వర్కులు, చిప్ పై సిస్టమ్ (SoC) మరియు స్టోరేజ్ సొల్యూషన్లు వంటి కొత్త తరపు సాంకేతికపరిజ్ఞానాల పై పని చేస్తారు.
సామ్సంగ్, కంప్యూటర్ సైన్స్ మరియు అనుబంధ శాఖలు (AI/ML/కంప్యూటర్ విజన్/VLSI మొదలైనవి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు కమ్యూనికేషన్ నెట్వర్కుల వంటి పలు విభాగాల నుండి ఇంజనీర్లను భర్తీ చేసుకుంటుంది. అంతే కాక, మేథమ్యాటిక్స్ & కంప్యూటింగ్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగాల నుండి కూడా సామ్సంగ్ ఉద్యోగులను భర్తీ చేసుకుంటుంది. “సామ్సంగ్ వారి R&D సెంటర్లు, భారతదేశపు అగ్రగామి ఇంజనీరింగ్ సంస్థల నుండి కొత్త నిపుణులను భర్తీ చేసుకోవాలని, తద్వారా ఆవిష్కరణలు మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల పై వారి ఏకాగ్రచిత్తాన్ని బలోపేతం చేసేందుకు సంకల్పించాయి. ఈ సరికొత్త నిపుణులు, భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజల జీవితాలను సౌభాగ్యవంతం చేసే ఆవిష్కరణలతో సహా నవీన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాలు, ఉత్పత్తులు మరియు డిజైన్ల కోసం కృషి చేస్తారు. డిజిటల్ ఇండియాను శక్తివంతం చేయాలన్న మా సంకల్పం దీనితో మరింత పురోభివృద్ధి చెందుతుంది,” అని సమీర్ వాథ్వాన్, హెడ్, హ్యూమన్ రిసోర్సెస్, సామ్సంగ్ ఇండియా అన్నారు.
ఈ హైరింగ్ సీజన్లో సామ్సంగ్ R&D సెంటర్లు దాదాపు 200 మంది ఇంజనీర్లను, అగ్రశ్రేణి ఐఐటిలైన ఐఐటి మద్రాసు, ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి బాంబే, ఐఐటి రూర్కీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి గువాహటి మరియు ఐఐటి బిహెచ్యు, ఇంకా ఇతర ఇనిస్టిట్యూట్లనుండి ఉద్యోగాల్లోకి భర్తీ చేసుకుంటాయి. ఐఐటిలు మరియు ఇతర అగ్రశ్రేణి ఇనిస్టిట్యూట్లకు చెందిన విద్యార్ధులకు ఈ సెంటర్లు 400లకు పైగా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు (పిపిఒలు) కూడా ఆఫర్ చేశాయి. భారతదేశంలోని సామ్సంగ్ రీసెర్చ్ సెంటర్లు, మల్టీ-కెమేరా సొల్యూషన్లు, టెలివిజన్లు, డిజిటల్ అప్లికేషన్లు, 5G, 6G మరియు అల్ట్రా వైడ్బ్యాండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ల ప్రోటోకాల్ వంటి రంగాల్లో 7,500లకు పైగా పేటెంట్ల కోసం దాఖలు చేసుకున్నాయి. వీటిలో చాలా పేటెంట్లను సామ్సంగ్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, నెట్వర్క్ ఉపకరణాలు మరియు డిజిటల్ అప్లికేషన్లు, ఇతర వస్తువులలో వాణిజ్యీకరించటమైనది. కొన్నేళ్ళుగా, భారతదేశంలోని సామ్సంగ్ R&D సెంటర్లు మేథోహక్కుల కోసం ఫైలింగ్ చేసే పటిష్టమైన సంస్కృతిని నిర్మించాయి. ఉదాహరణకు, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్, బెంగుళూరులో పేటెంటు (మేథోహక్కుల) కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది, 5G, AI, ML, IoT, కెమేరా & విజన్ టెక్నాలజీల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో తొలిసారి ఆవిష్కరణలు చేసినవారు. దీనితో, R&D సెంటర్, భారతదేశంలో జరిపిన ఆవిష్కరణల కోసం పేటెంటు కోసం దాఖలు చేసుకున్న అగ్రగామి పేటెంట్ ఫైలర్గా ఆవిర్భవించింది, భారతదేశంలో మొదటిసారి ఫైల్ చేసింది, మరియు 2021 & 2022 నేషనల్ ఐపి అవార్డును కూడా గెలుచుకున్నది.
సామ్సంగ్ న్యూస్రూమ్ లింక్ : శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్ను గురించి
శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్రూమ్ను http://news.samsung.com/in వద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్రూమ్ భారత్ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్ పై అనుసరించవచ్చు.