Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ బ్యాంక్ అంచనా
వాషింగ్టన్ : ప్రస్తుత ఏడాదిలో విదేశాల్లోని భారత ప్రవాసీలు దేశానికి భారీగా రెమిటెన్స్‌లు పంపనున్నారని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఏడాది రెమిటెన్స్‌ల విలువ 12 శాతం పెరిగి 100 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.81 వేల కోట్లు) చేరుతుందని ఆ నివేదిక పేర్కొంది. అమెరికా, బ్రిటన్, సింగపూర్‌లోని ప్రవాసి ఉద్యోగులు ఈ ఏడాది పెద్ద ఎత్తున నిధులు పంపనున్నారని తెలిపింది. తక్కువ వేతనాలు ఉండే గల్ఫ్ వంటి దేశాల నుంచి భారత్‌కు చెందిన ప్రవాసులు గత కొన్నేండ్లుగా అధిక వేతనాలిచ్చే బ్రిటన్, సింగపూర్, అమెరికా దేశాలకు వెళ్లిపోతున్నారని వెల్లడించింది. ఆయా దేశాల్లో వేతనాల పెంపునకు తోడు డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా రెమిటెన్స్‌లు పెరగడానికి ప్రధాన కారణమని ప్రపంచ బ్యాంక్ విశ్లేషించింది.