Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇటీవల తాము అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ కమ్యూనిటీ ఫీచర్ సామాజికంగా శక్తివంతమైన సాధనంగా మార నుందని మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ పేర్కొన్నారు. ఆయన భారత పర్యటన సందర్భంగా వాట్సాప్ కమ్యూనిటీ బిల్డర్స్ ప్రోగ్రా మ్‌లోని నాయకులతో, కమ్యూనిటీల ఇమ్మర్షన్ పేరిట నిర్వహించిన కార్యక్ర మంలో నిక్ క్లెగ్ పాల్గొని మాట్లాడారు. ఇటీవల ప్రారంభించిన 'కమ్యూనిటీస్ ఆన్ వాట్సాప్' ఫీచర్ సంస్థలకు ఎలా సహకారాన్ని అందిస్తుందో చర్చించారు. దేశవ్యాప్తంగా సామాజిక ప్రభావాన్ని పెంచే తమ ఉమ్మడి లక్ష్యంలో మెరుగైన అనుసంధానం, వ్యవస్థీకత మార్పునకు ఆ ఫీచర్ అందించే సహకారాన్ని ఆయన వివరించారు. సరళమైన, విశ్వసనీయమైన, సురక్షితమైన ఈ వేదికతో కమ్యూనిటీలు తమ గ్రూపు సంభాషణలను ఒకే గొడుగు క్రింద నిర్వహించుకోగలుగుతాయన్నారు.