Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది నవంబర్‌లో దేశ వ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 11 శాతం పెరిగి రూ.1.46 లక్ష ల కోట్లుగా నమోదయినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో రూ.1.31 లక్షల కోట్ల పన్నులు వసూళ్లయ్యాయి. అయి తే గత నెల రూ.1.51 లక్షల కోట్లతో పోలిస్తే పన్ను వసూళ్లలో కొంత తగ్గాయి. వరుసగా తొమ్మిదో నెలలోనూ రూ.1.40 లక్షల కోట్ల ఎగువన నమోదయ్యాయి. నవంబర్ మొత్తం వసూళ్లలో సీజీఎస్‌టీ కింద రూ.25,681 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.32,651 కోట్లు, ఐజిఎస్‌టి కింద రూ.77,103 కోట్లు, సెస్సుల రూపంలో రూ.10,433 కోట్లు సమకూరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో పన్ను వసూళ్లు 14 శాతం వృద్థితో రూ.3,931 కోట్లకు చేరగా.. తెలంగాణలో 8 శాతం పెరిగి రూ.4,228 కోట్లకు చేరాయి.