Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎన్‌డిటివిలోని సుదీర్ఘకాలం పని చేసిన సీనియర్ జర్నలిస్టు రవీష్ కుమార్ ఆ సంస్థకు రాజీనామా చేశారు. రామన్ మెగసెసె అవార్డు గ్రహీత అయినా రవీశ్ కుమార్ రాజీనామా చేసిన విషయాన్ని ఎన్‌డీటీవీ గ్రూప్ ప్రెసిడెంట్ సుపర్ణ సింగ్ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. తాను ఇకపై సొంత యూ ట్యూబ్ ఛానల్‌లో వార్తలను అందించ నున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్‌డీటీవీ ప్రమోటర్ సంస్థ అయిన ఆర్‌ఆర్‌పిఆర్ హోల్డింగ్ లిమిటెడ్ వ్యవస్థాపకులు రాధికా రాయ్, ప్రణరు రాయ్ డైరెక్టర్ల హోదా నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.