Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఏఈలో నిర్వహించే ఐఎల్‌టి20 ప్రారంభ సీజన్‌ను ఈ నూతన క్యాంపెయిన్ ప్రకటిస్తుంది మరియు 10 జీ ఛానెళ్లు మరియు దాని ఓటీటీ ప్లాట్‌ఫారం జీ5లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
నవతెలంగాణ-హైదరాబాద్: క్రీడా ప్రసారాలను తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో జనవరి 2023లో యుఏఈలో నిర్వహించనున్న జీ ఐఎల్‌టి20 ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఉత్సాహకరమైన కొత్త క్యాంపెయిన్‌ను జీ ప్రారంభించింది. ఇందులో ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఉండగా, ఇది టి20 పోటీల తీవ్రతకు, ఉత్తేజకరమైన గింపిల్స్‌ను అందించనుంది.
ఈ వాణిజ్య చిత్రంలో ఐఎల్‌టి 20 లీగ్‌ను సెహ్వాగ్ వ్యక్తిత్వంతో సంయోజన చేయడం ద్వారా కుతూహలాన్ని పుట్టించేలా ఉంటుంది. ఈ వాణిజ్య ప్రచార చిత్రాన్ని నజాఫ్‌గఢ్ నవాబ్‌గా గుర్తింపు దక్కించుకున్న సెహ్వాగ్ ఒక కొలను వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, ఆయన కార్యదర్శి, నటుడు బ్రిజేంద్ర కాలా అక్కడకు వచ్చి మిమ్మల్ని జీ సినిమా పెద్ద ప్రాజెక్టుకు ఆహ్వానిస్తోందని చెబుతారు. జీ సినిమా ఆర్ఆర్ఆర్, సూర్యవంశి, రాధె తదితర బ్లాక్ బస్టర్ సినిమాల ఐకానిక్ చలనచిత్రాల డెస్టినేషన్ కాగా, ఈ ప్రపంచ కప్ మాజీ విజేత కూడా తాను నటించనున్న సినిమాలో నటనకు సంబంధించే ఈ ప్రాజెక్టు ఉండవచ్చని అనుకుంటారు మరియు ఆయన సదా చలనచిత్రాలలో నటించేందుకు తనది పరిపూర్ణమైన రూపాన్ని కలిగి ఉన్నానని, మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జీ ప్రాజెక్టు కొత్త క్రికెట్ లీగ్‌కు సంబంధించినది అని కాలా చెప్పడంతో ఆయన ఆశ్చర్యానికి గురవుతారు.
క్రికెట్‌కు జీ తిరిగి రావడం అంటే క్రీడాభిమానులతో క్రియాశీలకం అయ్యేందుకు అవకాశం లభిస్తున్నందుకు ఉత్సుకతకు గురవుతున్నాను. పలు భాషలలో సినిమాలను ప్రసారం చేయడం మరియు టి20 క్రికెట్ అభిమానులకు ఉన్నతీకరించిన అనుభవాలను తీసుకు రావాలని మేము ప్రయత్నాలను కొనసాగిస్తున్నాము. మా బ్రాండ్ సినిమాలు అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుంటుంది. సినిమాలు మరియు క్రికెట్ అభిమానం అనే రెండు ప్రపంచాలు ఒక్కటిగా జీ మూవీ ఛానెళ్లలో ప్రసారం కావడాన్ని వీక్షించేందుకు ఉత్కంఠతతో ఉన్నాము్ణ్ణ అని కార్తిక్ మహదేవ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ - కంటెంట్ ఎస్‌బియు, జీ తెలిపారు. ాాఈ లీగ్ 3 భాషలలో మా 10 మూవీ ఛానెళ్లలో ప్రసారం కానుండగా, 419 మిలియన్ చలనచిత్ర వీక్షకులు మరియు మా డిజిటల్ ప్లాట్‌ఫారం జీ5 వీక్షకులను ఆకట్టుకోనుంది. ఈ కొత్త లీగ్‌ను బిల్డ్ చేసేందుకు మేము అత్యంత భారీ స్థాయిలో, పలు దశలలో క్యాంపెయిన్‌లను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాము. ఈ లీగ్‌ను ప్రకటించేందుకు మేము సెహ్వాగ్‌ను మాతో కలుపుకుంటుండగా, ఆయన క్రికెట్ ఆటగానిగా తన బ్యాట్‌మెన్‌షిప్ ద్వారా లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకుంటూ, తనకు అందించిన బాధ్యతలలో సహజంగా ఇందులో ఒదిగి పోతారు మరియు ఆటలో నిపుణుడిగా తదుపరి జీలో ప్రసారం కానున్న టి20 క్రికెట్ పోటీలకు సంబంధించి కుతూహలాన్ని పెంచనున్నారు్ణ్ణ అని పేర్కొన్నారు.
ఈ వాణిజ్య చిత్రాన్ని టిక్యూ-టకా మరియు దాని వ్యవస్థాపకుడు జిగర్ ఫెర్నాండెజ్ నిర్మించారు. జీ ఈ వాణిజ్య చిత్రంలో కొత్త లీగ్ ఐఎల్‌టి 20కి సంబంధించిన ఉత్సాహకరమైన అంశాన్ని క్రికెట్‌ను అభిమానించే ప్రియ వీక్షకులకు ప్రకటించే ఉత్సాహాన్ని ఇక్కడ వీక్షించండి: http://bitly.ws/xn75
దీని గురించి టిక్యూ-టకా వ్యవస్థాపకుడు మరియు క్రియేటివ్ హెడ్ జిగర్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ, క్రికెట్, సినిమాలు మస్తి మరియు మ్యూజిక్‌తో సమానార్థకమైన వేదికకు తిరిగి వస్తుండగా, క్రికెట్ మరియు సినిమా మొత్తం మీద వినోదమయం అయ్యాయి. క్రికెట్‌కు జీ సినిమా కొత్త వేదిక అనే జాగృతిని పెంపొందించడం అత్యవసరం. సెహ్వాగ్ సర్ దాన్ని తెలియజేసే విధానం అలాగే జోక్‌లతో నేతృత్వాన్ని వహించడం నిజంగా చాలా బాగుంది. వారు కెమెరా ముందు చాలా సహజంగా ఉంటారు. వారిని రానున్న రోజులలో వెండి తెర్ణపై చూస్తామన్న భరోసా మాకు ఉంది అని పేర్కొన్నారు.
ఈ 34- మ్యాచ్‌ల కార్యక్రమంలో 6 జట్లు ఉండగా, ఐఎల్‌టి 20 ట్రోఫీ కోసం హోరాహోరిగా పోటీ పడతాయి. ఈ టోర్నమెంట్ జీలోని 10 లీనియర్ ఛానెళ్లు ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషలు అలాగే జీ5 ఓటీటీ ప్లాట్‌ఫారాలలో ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ కార్యక్రమం జీ సినిమా (ఎస్‌సి మరియు హెచ్‌డి), జీ అన్‌మోల్ సినిమా, జీథిరై, జీ బాంగ్లా సినిమా, జీ జెస్ట్ (ఎస్‌సి మరియు హెచ్‌డి) డ పిక్చర్స్ హెచ్‌డి డ ఫ్లిక్స్ (ఎస్‌సి మరియు హెచ్‌డి) మరియు ఇండియా అలాగే ప్రపంచ వ్యాప్తంగా జీ5లలో ప్రసారం కానుంది.
జీలో ఐఎల్‌టి 20కు సంబంధించిన అన్ని అప్‌డేట్లను వారి అధీకృత సామాజిక మాధ్యమాల హ్యాండిళ్లలో పొందవచ్చు.
ఫేస్‌బుక్: https://www.facebook.com/ilt20onzee
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/ilt20onzee/
ట్విటర్: https://twitter.com/ilt20onzee