Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చిరోప్రాక్టిక్ ఆరోగ్య సంరక్షణ సేవల సంస్థ అట్లాస్ చికోప్రాక్టిక్ అండ్ వెల్‌నెస్ సంస్థ తమ నూతన సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. దేశంలో ఇది తమకు ఐదవ కేంద్రమని చిరోప్రాక్టిక్ హెడ్, అట్లాస్ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్ అడ్డగీతల తెలిపారు. శుక్రవారం ఇక్కడి సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతాప్ మాట్లాడుతూ.. ఇప్పటికే తమకు బెంగళూరు, చెన్నరులలో రెండు చొప్పున సెంటర్లు ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది ఎనిమిది కేంద్రాలకు విస్తరించ నున్నామన్నారు. వెన్ను, మెడనొప్పి మొదలు దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధుల సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు అందుబాటు ధరలలో మెరుగైన సేవలనందించాలనే కంపెనీ యొక్క నిరంతర ప్రయత్నాలకు నిదర్శనంగా హైదరాబాద్‌లోని అట్లాస్ చిరోప్రాక్టిక్ అండ్ వెల్‌నెస్ సెంటర్ నిలుస్తుందన్నారు. హైదరాబాద్ ఆఫీస్‌లో హెడ్ క్లీనిషియన్‌గా ఫ్రాన్స్‌కు చెందిన డాక్టర్ యాస్మిన్ ఐస్సా వ్యవహరించనున్నారన్నారు.