Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా కొత్తగా ఇవి ట్రక్‌ను విడుదల చేసింది. ఆ కంపెనీ తొలి ఇవి ట్రక్‌ను శీతల పానియాల కంపెనీ పెప్సికోకి అందించింది. ఈ ట్రక్ ఒక్క సారి ఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ఆ కంపెనీ వెల్లడించింది. ఈ 100 ట్రక్క్‌లను 2021లోనే పెప్సీకోకు అందించాల్సి ఉండగా.. కరోనా వల్ల ఆలస్యం అయ్యిందని టెస్లా వర్గాలు తెలిపాయి. ఈ వాహనం ధర 1,50,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.1.21 కోట్లు)గా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.