Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం మొత్తంలో 44శాతం మంది ఇక్కడి నుంచే
హైదరాబాద్ : అమెరికాలో చదువుల కోసం ప్రతీ ఏటా భారత్ నుంచి 84,000 మంది విద్యార్థులు వెళ్తున్నారని సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎరిక్ ఎస్ ఆర్మ్‌బ్రెచ్డ్ తెలిపారు. ఎరిక్ హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం భారతీయ విద్యార్థుల్లో 44 శాతం అంటే దాదాపు 33,000 మంది విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారని వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత కొత్త ట్రెండ్ ఏంటి అంటే అనేక అమెరికన్ విశ్వవిద్యాలయాలు స్థానిక సంస్థల సహకారంతో వర్చువల్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయన్నారు. భారతదేశ జనాభాలో అధిక భాగం యువకులు, ప్రతిభావంతులు ఉన్నందున వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అపారంగా తోడ్పడగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.