Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (ఐడీపీడీ) ను డిసెంబర్ 03వ తేదీన నిర్వహిస్తుంటారు. ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్ధ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును దివ్యాంగుల సాధికారిత కోసం కృషి చేస్తున్నందుకు భారత రాష్ట్రపతి ప్రకటించారు. డాక్టర్ రెడ్డీస్ ఈ అవార్డును ‘బెస్ట్ ప్లేస్మెంట్ ఏజెన్సీ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్’ విభాగంలో అందజేశారు. డాక్టర్ రెడ్డీస్ యొక్క కమ్యూనిటీ కార్యక్రమం ‘గ్రోత్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (గ్రో పీడబ్ల్యుడీ)’ ద్వారా దివ్యాంగుల సాధికారితకు అందిస్తున్న తోడ్పాటును గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ లిమిటెడ్ మరియు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ రెడ్డి అందుకున్నారు. ఈ సత్కార కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సీఈఓ షామిక్ ట్రెహాన్; డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ పీడబ్ల్యుడీ –లీడ్ శ్రీ లక్ష్మి బి పాల్గొన్నారు.
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (డీఆర్ఎఫ్) 1999లో ‘లైవ్లీహుడ్ అడ్వాన్స్మెంట్ బిజినెస్ స్కూల్ (ల్యాబ్స్)’ కార్యక్రమాన్ని నైపుణ్యాభివృద్ధి కోసం ప్రారంభించింది. 2010లో, ల్యాబ్స్‌ను దివ్యాంగుల కోసం కూడా విస్తరించి ‘ప్రోగ్రామ్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (ల్యాబ్స్ పీడబ్ల్యుడీ)’గా ప్రారంభించారు. 2016లో, ఈ ల్యాబ్స్ పీడబ్ల్యుడీ ను పునః రూపకల్పన చేసి ‘గ్రో పీడబ్ల్యుడీ’గా ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం 11 రకాల వైకల్యాలతో బాధపడుతున్న వ్యక్తులను చేరుకుంటుంది. వీటిలో శారీరక వైకల్యం, దృష్టిలోపం, మూగ మరియు చెవుడు, మేధోపరమైన లోపం, ఆటిజం మరియు ఇతరములు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని 16 రాష్ట్రాలలో 39 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా 5వేల మంది యువతకు శిక్షణ అందిస్తున్నారు. గ్రో ఇప్పటి వరకూ 27వేల మంది దివ్యాంగులకు విజయవంతంగా శిక్షణ అందించింది. అంతేకాదు వీరిలో 65%మందికి ఉపాధినీ కల్పించింది. అరవై రోజుల ఫుల్ టైమ్ ప్రోగ్రామ్‌గా , ఉపాధి అర్హమైన నైపుణ్యాలలో గ్రో పూర్తి స్ధాయి శిక్షణను పలు రంగాల్లో ప్రవేశ దశ ఉద్యోగాల కోసం అందిస్తుంది. అన్ని శిక్షణా కేంద్రాలలోనూ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటర్స్ (సంకేత భాష వ్యాఖ్యాతలు) ఉంటారు. వీరు చెవుడు, మూగ బాధితులకు అవసరమైన శిక్షణ అందిస్తారు. విద్యార్ధుల డాటాబేస్ నిర్వహించడానికి ప్రత్యేకంగా ఐటీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. అలాగే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అల్గారిథమ్ కారణంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలను గురించి ఔత్సాహికులకు వివరించడం జరుగుతుంది. డీఆర్ఎఫ్ ఇప్పటికే ‘స్కిల్ కౌన్సిల్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ (ఎస్డీపీడబ్ల్యుడీ)’తో భాగస్వామ్యం చేసుకుంది. దీనిద్వారా మరింతగా చేరుకోవడంతో పాటుగా ప్రభావం చూపడమూ సాధ్యమవుతుంది. దివ్యాంగులైన గ్రాడ్యుయేట్లకు అత్యున్నత స్థాయి శిక్షణను అందించడం ఇది లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా బహుళ జాతి కంపెనీలలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తుంది. అంతేకాదు, నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణను మరింత లోతుగా తీసుకువెళ్లడంతో పాటుగా స్ధానిక కమ్యూనిటీలో కూడా ఉపాధి అవకాశాలను అందించేందుకు కృషి చేస్తుంది. హబ్ అండ్ స్పోక్ ప్రోగ్రామ్ ద్వారా ఈ శిక్షణ అందించడంతో పాటుగా బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, భీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలలో ఆ రంగాలకు తగినట్లుగా నిర్ధిష్టమైన శిక్షణనూ అందిస్తుంది. ఓ కంపెనీగా డాక్టర్ రెడ్డీస్ 2030 నాటికి తమ మొత్తం సిబ్బందిలో కనీసం 3% దివ్యాంగులు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమ పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) లక్ష్యాలలో కీలక భాగంగా మరింత దయగల, సమ్మిళిత సమాజం దిశగా కృషి చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మమమైన గుర్తింపు కంపెనీ యొక్క వైవిధ్యత, ఈక్విటీ, సమ్మిళిత ప్రయాణంలో సంస్థ యొక్క సంకల్పం, ప్రయత్నాలను బలోపేతం చేయనుంది.