Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 620 సీట్లతో మాదాపూర్లో సెంటర్
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
ఆఫీస్ స్పేస్ రంగంలో ఉన్న ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్స్ కోసం ద్వారక ప్రైడ్ పేరుతో నూతన సెంటర్ను ఏర్పాటు చేసింది. 620 సీట్లతో మాదాపూర్లో దీనిని ప్రారంభించింది. దీంతో సంస్థద్వారా 13 కేంద్రాలకు గాను 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 6,500 సీట్ల సామర్థ్యానికి చేరుకున్నామని ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి తెలిపారు. కంపెనీ డైరెక్టర్ డాక్టర్ దీప్నా రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్విగ్గీ, తాన్లా, మెడికవర్ హాస్పిటల్స్, ష్నైడర్, రామ్ ఇన్ఫో వంటి 100కుపైగా కంపెనీల కార్యాలయాలు ద్వారక ప్రాజెక్టుల్లో కొలువుదీరాయని చెప్పారు. మెట్రోకు సమీపంలో కార్యాలయాలు ఉండేందుకు క్లయింట్లు మొగ్గుచూపుతుండడంతో ఆ ప్రాంతాలవైపే ఫోకస్ చేస్తున్నామన్నారు. కొత్తగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్టులను 2024 మార్చినాటికి అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించారు. తద్వారా మరో 4,500 సీట్ల సామర్థ్యం అందుబాటులోకి రానుందని చెప్పారు.