Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో అతి పెద్ద రక్తదాన కార్యక్రమం
- 1,150 నగరాలలో 5,500 రక్తదాన శిబిరాలు
నవతెలంగాణ న్యూఢిల్లీ: భారతదేశంలోని అగ్రగామి ప్రయివేటు బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు 9వ తారీఖున దేశ వ్యాప్తంగా ‘రక్తదాన శిబిరాలను’ నిర్వహించనుంది. ఈ ఏడాది క్యాంపెయిన్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు తన అగ్రగామి సిఎస్ఆర్ కార్యక్రమం #పరివర్తన్లో భాగంగా నిర్వహిస్తున్న అగ్రగామి ఆరోగ్య సేవల కార్యక్రమంగా ఉంది. బ్యాంకు 14వ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను భారతదేశ వ్యాప్తంగా 1,150 నగరాలలో 5,500 కేంద్రాలలతో నిర్వహించనున్నారు. ఇందులో పెద్ద కార్పొరేట్ సంస్థలు, కళాశాలలు మరియు బ్యాంకు శాఖల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
రక్తదానం చేయాలని కోరుకుంటున్న వారు ఈ దిగువ పేర్కొన్న లింక్ ఉపయోగించి బ్యాంకు వెబ్సైట్లో సమీపంలోని రక్తదాన శిబిరం వివరాలు తెలుసుకోవచ్చు:
https://leads.hdfcbank.com/applications/webforms/apply/Blood_Donation_Campaign/index.aspx?AspxAutoDetectCookieSupport=1
ఈ శిబిరాలలో 4.5 లక్షలకు పైగా దాతలు ఈ ఏడాది నిర్వహిస్తున్న కార్యక్రమాలలో పాల్గొంటారని అంచనా. బ్యాంకు ఈ నగరాలలో సాంకేతిక మరియు పని నిర్వహణ మద్దతుకు స్థానిక ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు మరియు కళాశాలల భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా 1,200కు పైచిలుకు రక్తదాన కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. ‘‘ఇది భారతదేశ వ్యాప్తంగా 14వ ఏడాది నిర్వహిస్తున్న క్యాంపెయిన్ కాగా, మేము 2007 నుంచి మేము సగర్వంగా మద్దతు ఇస్తున్నాము’’ అని హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆపరేషన్స్ గ్రూపు హెడ్ భవేశ్ జవేరి తెలిపారు. ‘‘వైద్య చికిత్సలకు కావలసిన రక్తాన్ని దాతల నుంచి స్థిరంగా రక్తం అందుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆసుపత్రిలో చేరే ఏడుగురిలో ఒకరికి అవసరం ఉంటుంది. కొవిడ్ మరియు ఇతర ముందు జాగ్రత్తలను తీసుకుని రక్తదానం చేయడం సురక్షితం అని నిపుణులు ధ్రువీకరించారు. ఈ శుక్రవారం డిసెంబరు 9న మీకు చేరువలోని శిబిరంలో రక్తదానం చేయడం ద్వారా మీ చుట్టుపక్కల సముదాయాలలోని జీవితాలలో నిజమైన మార్పు తీసుకు వచ్చేందుకు మీకు సాధ్యమైనంత మేర మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము’’ అని తెలిపారు.
‘‘హెచ్డిఎఫ్సి బ్యాంక్ #పరివర్తన్ సమాజంలో సకారాత్మక మార్పు తీసుకు వచ్చేందుకు కట్టుబడి ఉంది. అఖిల భారత స్థాయిలో రక్తదాన కార్యక్రమం ఈ దిశలో నిజాయతీతో కూడిన మా ప్రయత్నంగా ఉంది మరియు రక్తదాన ప్రాముఖ్యత గురించి జాగృతిని కల్పించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడుతుంది. రక్తదానంతో లక్షలాది మంది ప్రజల జీవితాలను కాపాడవచ్చు మరియు తదుపరి తరానికి రానున్న ఏడాదులలో ఈ సందేశాన్ని అందించవలసి ఉంది. పలు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అటువంటి వారితో అపారమైన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నేను నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను’’ అని ఈఎస్జీ మరియు సిఎస్ఆర్ విభాగం, బిజినెస్ ఫైనాన్స్ అండ్ స్ట్రేటజీ, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూపు హెడ్, అశిమా భట్ తెలిపారు.
ఈ కార్యక్రమం 2013లో అత్యంత పెద్ద (ఒక రోజు, పలు కేంద్రాలు) స్థాయిలో రక్తదాన శిబిరాలను నిర్వహించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్TM పుస్తకంలో పేరు నమోదు చేసుకుంది అలాగే ప్రమాణ పత్రాన్ని అందుకుంది. ఈ కార్యక్రమం 2007లో కేవలం 88 కేంద్రాలలో 4000 దాతల నుంచి ప్రారంభమైంది.