Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బెంగళూరు: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది! భారతదేశంలో 57 శాతానికి పైచిలుకు వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలు ఇచ్చే ప్రయోజనాలు, అనుకూలతను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు వాహనాలు (EVs)లపై పెట్టుబడి పెట్టాలని, 56% మంది ఈవీలను పర్యావరణానికి హాని చేయవలనే కారణంతో కొనుగోలు చేయాలన కోరుకుంటున్నారు. భారతదేశంలో టెక్నాలజీ-ఫస్ట్ అకో (ACKO) మరియు యుగౌ ఇండియా విడుదల చేసిన సరికొత్త నివేదికలోని కొన్ని ప్రముఖ అంశాలలో ఇవి కూడా ఉన్నాయి. ఈ నివేదిక న్యూ కన్సూమరర్ క్లాసిఫికేషన్ సిస్టమ్ (NCCS) ఎ , బి నివాసాల నుంచి 28 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన విద్యుత్తు వాహనాల యజమానులు లేదా రానున్న 12 నెలలలో వాహనాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్న 1018 మందితో సమీక్ష నిర్వహించి రూపొందించారు.
భవిష్యత్తు ఎలక్ట్రిక్‌దేనని విశ్వసిస్తున్న వినియోగదారులు
సమీక్షకు స్పందించిన వారిలో ఎక్కువ మంది అంటే 60% మంది భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు విద్యుత్తు వాహనాలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు మరియు భారీ మార్పులు అవసరం అని విశ్వసిస్తుండగా, భవిష్యత్తులో చక్కని మార్పులు వస్తాయని ధీమాతో ఉన్నారు. ఈ సమీక్షకు స్పందించిన వారిలో 89% మంది 2030 నాటికి భారతదేశంలో ఈవీలకు కావలసిన మౌలిక సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. మరో 66% మంది పెట్రోలు, డీజిల్ వాహనాలను విద్యుత్తు వాహనాలు అధిగమిస్తాయని, దీర్ఘావధిలో నగదు ఆదా చేసేందుకు ఇవి అత్యుత్తమమైనవి విశ్వసిస్తున్నాము అని తెలిపారు.
ఈవీ ఎందుకు?
సమీక్షకు స్పందించిన వారిలో వాహనాలను కొనుగోలు చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవారిలో 44% మంది ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టుబడి పెట్టాలన్న ఆలోన ఉందన్నారు ఎందుకంటే, వారు అవి అందించే అనుకూలతలను ఇష్టపడ్డారు. దీనితో వారు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎంపికల అందుబాటు వారికి రెండు అనుకూలతలను అందిస్తాయని విశ్వసిస్త్నున్నారు.
వాహనాలను కొనుగోలు చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవారిలో 47% మంది సంప్రదాయక వాహనాలతో పోల్చితే 47% మంది ఎలక్ట్రిక్ వాహనాలు ప్రతి మైలుకు వచ్చే ఖర్చును గమనార్హంగా తగ్గిస్తాయి అని విశ్వసించారు. అలాగే 56% మంది తమ పరిసరాల గురించి బాధ్యతాయుతమైన మార్పులో భాగం కావాలని కోరుకుంటున్నామని, కొత్త సాంకేతికత పట్ల ఆసక్తి కలిగి ఉన్నామని తెలిపారు.
ఈవీ యజమానుల విషయానికి వస్తే ఆసక్తిదాయకరమైన అంశం ఏమిటంటే, తాము పర్యావరణం చక్కగా ఉండేందుకు శ్రమించాలన్న కోరిక కలిగి ఉన్నామని, దాని ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఉదాహరణకు 63% మంది ఈవీ యజమానులు వారి కర్బన అడుడుజాడల గుర్తును తగ్గించేందుకు తమ ప్రయత్నాలలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంపిక చేసుకుంటామని తెలిపారు. సమీక్షకు స్పందించిన వారిలో 62% మంది పెరిగిపోతున్న ఇంధన ధరల గురించి అవగాహన కలిగి ఉన్నారు. వారిలో 57% అత్యాధునిక సాంకేతితకపై ఆసక్తి కలిగి ఉండగా, 51% మంది వారు పెట్రోలు, డీజిల్ కార్లతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు అవకాశాన్ని ఇస్తాయని తెలిపారు. మరో 48% మంది వాహన యజమానులు ఎలక్ట్రిక్ వాహనాలు సంప్రదాయక కార్ల కన్నా ప్రతి మైలుకు దక్షతతో కూడిన ఖర్చుని ఇస్తాయని పేర్కొన్నారు.
ప్రజలను ఈవీలపై పెట్టుబడి పెట్టకుండా ఏవి అడ్డుకుంటున్నాయి?
ఈ నివేదికలో అన్ని సమాధానాలు ఉన్నాయి. ఛార్జింగ్ చేసుకునేందుకు ఉన్న అవకాశాల కొరత అత్యంత పెద్ద బాధ్యతతో కూడిన సమస్య కాగా, అప్పుడప్పుడు వార్తలలోకి వస్తున్న సురక్షత సమస్యలు తదుపరి కారణంగా ఉంది.
సమీక్షకు స్పందించిన వారిలో ఇళ్ల వద్ద, చుట్టుపక్కల ఛార్జింగ్ సదుపాయాల కొరతకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిపారు. వారు ఒక వాహనం పూర్తిగా ఛార్జింగ్ అయ్యేందుకు తసుకునే సమయం గురించి ఎక్కువ స్పష్టత అవసరం ఉందని తెలిపారు. దీనితో సమీక్షకు స్పందించిన వారిలో 40% అప్పుడప్పుడు వార్తలలోకి వస్తున్న మంటల్లో కాలిపోతున్న ఈవీల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సమీక్షకు స్పందించి, ఇతర కారణాలను పేర్కొన్న వారిలో బ్యాటరీ మార్పు ఖర్చు, ఎన్ని రోజులకు ఒకసారి దాని అవసరం ఉంటుందనే అంశం ప్రముఖమైదని పేర్కొన్నారు. ఎందుకంటే, అవి ఈవీ ప్రాథమిక ఖర్చులలో ఒకటిగా ఉంది. వారు ఈవీలలో దూర ప్రయాణం చేసే అవకాశాల గురించీ వారు పేర్కొన్నారు.
అంతే కాకుండా, 41% మంది ఈవీ యజమానులు వారి ఎలక్ట్రిక్ వాహనం ఛార్జ్ అయ్యేందుకు చాలా సమయం పడుతుందని అన్నారు మరియు 40% మంది యజమానులు నివాస సముదాయాల ఆవరణలో ఛార్జింగ్ చేసుకునే సదుపాయాలకు చాలా కొరత ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమీక్షకు స్పందించిన వారిలో 49% మంది బ్యాటరీ మార్పు ఈవీ యాజమాన్యపు ఖర్చు అని విశ్వసిస్తున్నారు. మరో 43% మంది ఇవీ యజమానులు సంప్రదాయక వాహనాలతో పోల్చితే వారి వాహన డ్రైవింగ్ అనుభవం మరియు పనితీరు నిరీక్షకు అనుగుణంగా లేవని విశ్వసిస్తున్నారు అనేది వారి ప్రాధాన్యతలతో కూడిన బాధ్యతగా ఉంది.
‘‘భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతి పెద్ద కార్ల మార్కెట్‌గా ఉంది. విద్యుత్తు వాహనాలు వినియోగదారులకు ప్రాథమిక ఎంపిక అవుతున్నప్పుడు మేము ఈవీల గురించి వారి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుకున్నాము. మేము యుగౌ ఇండియాతో కలిసి పని చేశాము మరియు ఈవీల గురించి వినియోగదారుల అభిప్రాయాలను చక్కగా అర్థం చేసుకునేందుకు ప్రస్తుత యజమానులు లేదా వచ్చే ఏడాదిలోగా ఈవీలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్న ప్రజలతో మాట్లాడాము. దీని ఫలితాంశాల ఆధారంగా ఈవీ యజమానులు అలాగే ఆ రంగానికి చెందిన వారితో కలిసి మేము భారతదేశంలో విద్యుత్తు వాహనాలను అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతలు మరియు అడ్డంకులను గుర్తించగలిగాము’’ అని అకో (ACKO) సీనియరు డైరెక్టర్-మోటార్ అండర్‌రైటింగ్ అనిమేశ్ దాస్ తెలిపారు.
ఈ నివేదికలో ఈవీల గురించి భర్తీ చేయవలసిన పరిజ్ఞానం గురించి కూడా ప్రత్యేకంగా పొందుపరిచారు.
ఉదాహరణకు, ఆందోళనకర స్థాయిలో 63% మంది ఈవీలకు మంటలు అంటుకున్న సమయంలో మట్టి పోవడం అత్యంత అనుకూలకరమైన పరిహారం అని తెలియదు. బ్యాటరీ లైఫ్‌టైమ్ గురించి కూడా అవగాహనలో పలు అంతరాలు ఉన్నాయి. ఉదాహరణకు 66% మంది బ్యాటరీ లైఫ్‌టైమ్ కేవలం 2 నుంచి 5 ఏళ్లు అని నమ్ముతున్నారు. మంచి వార్త ఏమిటంటే 10లో 8 మంది ఛార్జింగ్ సైకిల్ అనేది ఈవీ బ్యాటరీ లైఫ్‌టైమ్‌ను కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని గుర్తించారు.
ఈవీ యాజమాన్యపు మరొక ప్రముఖ ఆయామం ఏమిటంటే, బీమా, ఈవీలకు పెరుగుతున్న ప్రజాదరణతో ప్రత్యేకంగా రూపొందించిన బీమా ఉత్పత్తుల డిమాండ్‌లో వృద్ధి కనిపిస్తోంది. సమీక్షకు స్పందించిన వారిలో 79% మంది తమ ఈవీలకు ప్రత్యేకంగా రూపొందించిన బీమా పరిహారాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. 67% మంది దానికి తగిన ప్రీమియం చెల్లించేందుకు సిద్ధమని చెప్పారు. అదేమైనప్పటికీ 53% మంది వారికి ఈవీ సంబంధిత బీమా ఉత్పత్తులను అందించేందుకు విశ్వసనీయమైన భాగస్వామి లేరని పేర్కొన్నారు.
పాలసీ కొనుగోలుకు ఈవీ కొనుగోలుదారులు, యజమానులు ఆన్లైన్లో బీమా సేవలను అందించే వారిని ఎంపిక చేసుకుంటున్నారు. మరో 59 మంది వినియోగదారులు అకో (ACKO) వంటి ఆన్లైన్ సంస్థల నుంచి పాలసీ కొనుగోలు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ నివేదికలోని ప్రముఖ అంశం ఏమిటంటే ఈవీలు, ఈవీలకు సంబంధించిన వివిధ ఆయామాల గురించి అవగాహనను కల్పించవలసిన అత్యవసరం ఉంది. భారతీయులు ఈవీల గురించి ఉత్సుకతను కలిగి ఉన్నారు. వాటిని భవిష్యత్తు మొబిలిటీ అని అంగీకరిస్తున్నారు. అయితే మార్కెట్లో సమాచారం కొరత, కమ్యూనికేషన్ అంతరాలు వారిని వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి.