Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖపట్నంలో నూతన కార్‌కేర్ స్టూడియో ప్రారంభం
నవతెలంగాణ వైజాగ్: అవార్డులు అందుకున్న, చికాగో కేంద్రంగా కలిగిన కార్ కేర్ కంపెనీ నేడు తమ కో–బ్రాండెండ్ కార్ కేర్ స్టూడియోను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కార్ప్రో డిటైలింగ్ మరియు యాక్ససరీ భాగస్వామ్యంతో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ స్టూడియో 50–2–34/3, ఎన్‌హెచ్5 రోడ్, గాంధీ నగర్, న్యూ సత్యం జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్– 530013 వద్ద ఉంది. అలా్ట్ర మోడ్రన్ టర్టెల్ వ్యాక్స్ డిటైలింగ్ సాంకేతికతలు మరియు అత్యున్నత అర్హతలు మరియు శిక్షణ పొందిన వ్యక్తుల బృందం కలిగిన ఈ టర్టెల్ వ్యాక్స్ కార్ కేర్ స్టూడియో విస్తృత శ్రేణిలో కార్ డిటైలింగ్ సేవలు, ఉత్పత్తులను ప్రత్యేకంగా కారు ప్రేమికుల వ్యక్తిగత అభిరుచులను తీర్చే రీతిలో తీర్చిదిద్దారు.
కార్ప్రో తమతో పాటుగా సంవత్సరాల తరబడి నైపుణ్యవంతమైన కార్ కేర్, డిటైలింగ్‌ను వైజాగ్‌లో అందిస్తుంది. ఇది టర్టెల్ వ్యాక్స్ యొక్క డిటైలింగ్ ఆవిష్కరణలు మరియు నైపుణ్యంను జతకూర్చి మహోన్నతమైన విలువను అత్యుత్తమ శ్రేణి నాణ్యత, కస్టమర్ సేవలతో అందిస్తుంది. టర్టెల్వ్యాక్స్ కేర్ కార్ స్టూడియో ఇప్పుడు ప్రొఫెఫనల్ వాహన నిర్వహణ మరియు పరిశుభ్రత కోసం వినియోగదారుల డిమాండ్‌ను తీరుస్తుంది. ఈ స్టూడియో బహుళ కేర్ ప్యాకేజీలను అందిస్తుంది. టర్టెల్ వ్యాక్స్ యొక్క సెరామిక్ మరియు గ్రాఫైన్ శ్రేణిని అత్యాధునిక సాంకేతికతలను వినియోగించి అసాధారణ ఫలితాలతో అందిస్తుంది.
కార్ కేర్ స్టూడియో వద్ద వినియోగదారులు ప్రొఫెషనల్ ఫలితాలను ప్రపంచం అభిమానించే టర్టెల్ వ్యాక్స్ అత్యుత్తమ డిటైలింగ్ ఉత్పత్తులు అయిన హైబ్రిడ్ సొల్యూషన్స్ మరియు పేటెంట్ గ్రాఫైన్ టెక్నాలజీతో హైబ్రిడ్ సొల్యూషన్స్ ప్రోను ఆస్వాదించవచ్చు.
ఈ ఆవిష్కరణ సందర్భంగా టర్టెల్ వ్యాక్స్ కార్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సాజన్ మురళి పుర్వాంగర మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్ నుంచి కార్కేర్కు ఆసక్తి పెరుగుతుండటం మేము చూస్తున్నాము మరియు విశాఖపట్నంలో మా మొట్టమొదటి కార్‌కేర్ స్టూడియోను ప్రారంభించాము. ఈ సరికొత్త స్టూడియోతో మేము అత్యత్తమ శ్రేణి ప్రీమియం నాణ్యత కలిగిన కార్ డిటైలింగ్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాము. ఈ బ్రాండ్‌కు అతి పెద్ద శ్రేణి విభాగాలు మరియు ఉత్పత్తులు ఉన్నాయి. తద్వారా లభ్యమయ్యే వినూత్నమైన డీఐఎఫ్ఎం సేవలను ఆస్వాదించవచ్చు. కార్‌ప్రోతో మా భాగస్వామ్యంతో మేము చక్కటి కార్‌కేర్ సేవలు మరియు ప్రయోజనాలను ఈ ప్రాంతంలో అందిస్తున్నాము. మా డీలర్ నెట్వర్క్ పట్ల మేము చాలా సంతోషం్గఆ ఉన్నాము. రాబోయే సంవత్సరాలలో మేము మరింతగా బలోపేతం కానున్నాము. దీనితో పాటుగా దేశవ్యాప్తంగా టియర్ 2 , 3 పట్టణాలలో విస్తరించనున్నాము’’ అని అన్నారు.
వినియోగదారులు ఇప్పుడు టర్టెల్ వ్యాక్స్ కార్ కేర్ స్టూడియోలో అత్యంత వేగవంతమైన సేవలను వేగవంతంగా శుభ్రపరచడం, తాజాదనపు అనుభూతుల కోసం పొందవచ్చు. మరీ ముఖ్యంగా రోడ్డు మీదకు రాకుండానే ఈ సేవలను వినియోగించవచ్చు. టర్టెల్ వ్యాక్స్ ఉత్పత్తులు వాహన బాడీ పెయింట్‌కు ప్రమాదకరం కాని రీతిలో ఉండటంతో పాటుగా అసాధారణ వాతావరణ పరిస్థితులలో సైతం కారు వెలుపలి భాగాలను గీతలు, రంగు మారిపోవడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. ఇంటీరియర్ క్లీనింగ్ సైతం అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇంటీరియర్స్ సరిగా ఉంటే ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాలూ సాధ్యమవుతాయి. టర్టెల్ వ్యాక్స్ ఇప్పుడు విస్తృత శ్రేణి ఇంటీరియర్ డిటైలింగ్ కార్ కేర్ ఉత్పత్తులు సైతం అందిస్తుంది.
ఈ నూతన భాగస్వామ్యం గురించి కార్ప్రో యజమాని శ్రీ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కార్ప్రో వద్ద మేము ఆవిష్కరణ పరంగా శ్రేష్టతను అందించడంతో పాటుగా వినియోగదారులకు ఆనందానుభూతులను అందించేందుకు ప్రయత్నిస్తున్నాము. అంతర్జాతీయంగా కార్ కేర్ పరంగా అగ్రగామి సంస్ధతో భాగస్వామ్యం చేసుకుని, దానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. టర్టెల్ వ్యాక్స్ తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇక్కడి కారు ప్రేమికులకు మహోన్నత అనుభవాలను అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.
టర్టెల్ వ్యాక్స్ కార్ కేర్ స్టూడియో వద్ద లభ్యమయ్యే చికిత్సలు ఈ దిగువ రీతిలో ఉన్నాయి...
· సెరామిక్ కోట్ ప్రొటెక్షన్ – ఇది పెయింట్ కరెక్షన్ను ప్రామాణిక డిటైలింగ్ ప్రక్రియ, ప్రీ క్లీన్, సెరామిక్ కోట్ ప్రొటెక్షన్‌తో అందిస్తుంది.
· హైబ్రిడ్ సెరామిక్ కోటింగ్ – దీనిలో బేసిక్ ఎక్స్టీరియర్ వాష్, రైన్స్, డ్రై , పెయింట్ కరెక్షన్, హైబ్రిడ్ సొల్యూషన్స్ వాష్ మరియు వెట్ వ్యాక్స్, హైబ్రిడ్ సొల్యూషన్స్ సెరామిక్ స్ర్పే కోటింగ్ కూడా భాగంగా ఉంటాయి.
· ఎక్స్టీరియర్ రిస్టోరేషన్ ట్రీట్మెంట్ – ఇది మూడు రకాలుగా ఉంటుంది ః పెయింట్ కరెక్షన్తో స్మార్ట్ షీల్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్ ; సూపర్ హార్డ్ షెల్ షైన్ ; క్లీన్ మరియు షైన్
· ఇంటీరియర్ డిటైలింగ్ ట్రీట్మెంట్ – బేసిక్ ఇంటీరియర్ క్లీనింగ్ లేదా సమగ్రమైన ఇంటీరియర్ డిటైలింగ్ కోసం తోడ్పడుతుంది. దీనిలో కార్పెట్లు, అప్‌హోలెస్ట్రీ, రూఫ్ క్లీనింగ్ , ప్లాస్టిక్స్, వినైల్, సీట్స్ , లెదర్, ఏసీ వెంట్స్, ఎయిర్ ఫ్రెషనర్, డ్రెస్సింగ్, రబ్బర్ బీడింగ్, డోర్ జామ్స్, సీట్‌బెల్ట్స్,గ్లాస్ ఉంటాయి
· స్పెషాలిటీ ట్రీట్మెంట్ – దీనిలో ఓడర్ ట్రీట్మెంట్, హెడ్‌లైట్ లెన్స్ రిస్టోరేషన్, రెయిన్– రెపల్లంట్ కోటింగ్, ట్రిమ్స్, క్రోమ్స్రిస్టోరేషన్ ఉంటాయి.
· వాష్– 45 నిమిషాల క్లీనింగ్ లో భాగంగా క్లీనింగ్, వాక్యూమింగ్, కాక్‌పిట్ క్లీనింగ్, ప్రీ వాష్ రైన్స్, అల్లాయ్ వీల్స్, టైర్స్ క్లీనింగ్, ఫోమ్ వాష్, స్ర్పెడ్, రైన్స్, డ్రై, గ్లాస్ క్లీనింగ్ , టైర్ డ్రెస్సింగ్ ఉన్నాయి.
టర్టెల్ వాక్స్ ఉత్పత్తులను టోల్‌ఫ్రీ నెంబర్ 1 800 102 6155 కు కాల్ చేసి మరియు మా కస్టమర్ కేర్ బృందం customercareindia@turtlewax.com ద్వారా కొనుగోలు చేయవచ్చు
ఆధీకృత రిటైలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ లేదా ఓఈఎం టై అప్స్ కోసం టర్టెల్ వాక్స్ కార్పోరేషన్ బృందంను indiatradeenquiry@turtlewax.com.. చేరుకోవచ్చు. భారతదేశంలో విడుదల చేసిన టర్టెల్ వాక్స్ ఉత్పత్తుల పూర్తి జాబితా గురించి తెలుసుకునేందుకు దయచేసి www.turtlewax.inచూడండి మరియు సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌పై @TurtleWaxవద్ద మరియు ఇన్స్టాగ్రామ్పైః@TurtleWaxIndia వద్ద చూడవచ్చు.