Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.6,200 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు
- మానవ భవిష్యత్తు డేటానే : మంత్రి కెటిఆర్
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం ఐటి రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. తాజాగా క్యాపిటల్యాం డ్ ఐటి కారిడార్‌లో రూ.6,200 కోట్ల పెట్టుబడు లకు ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో వివిధ విభాగాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో క్యాపిటాల్యాండ్ మంగళవారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ దాస్ గుప్తా, రియల్ అసెట్స్ సిఇఒ పాట్రిక్ బూకాక్ పాల్గొన్నారు. రూ.6200 కోట్లతో హైదరాబాద్‌లో ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఆ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించ నున్నట్లు ప్రకటించింది. రూ.1,200 కోట్ల పెట్టుబడి తో హైదరాబాద్ మాదాపూర్‌లోని సిఎల్ఐఎన్టి ఇంటర్నేషనల్ టెక్ పార్క్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఈ ఐటిపిహెచ్ డేటా సెంటర్‌ను ఐదు సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్న ట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తమకున్న సుమారు 60 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాలలో మరో రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఈ సందర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటి. మానవ భవిష్యత్తును మరింత మెరుగు పరచడంలో డేటానే కీలక పాత్ర పోషించబోతుంది. రాష్ట్రంలో క్యాపిటల్యాండ్ పెట్టుబడులు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో రోజురోజుకు డెవలప్ అవుతున్న ఐటి పరిశ్రమ అవసరాలు ఈ డేటా సెంటర్‌తో తీరుతాయి. అదే విధంగా ఇతర ఐటి, ఐటి అనుబంధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిటల్యాండ్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది.'' అని కెటిఆర్ పేర్కొన్నారు. ఆసియా,యూరప్‌లో ఉన్న 25 డేటా సెంటర్లతో గత కొన్ని సంవత్సరాలుగా డేటా సెంటర్ డిజైన్, అభివృద్ధి, నిర్వహణలో తాము మిగతా వారి కంటే ఎంతో ముందున్నామని క్యాపి టల్ ల్యాండ్ ప్రయివేటు ఈక్విటీ ఆల్టర్నేటివ్ అసెట్స్, రియల్ అసెట్స్ సిఇఒ పాట్రిక్ బూకాక్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనుకున్న తమ ప్రణాళికలో భాగంగా క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్‌తో కలిసి ఇండియాలో రెండవ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంద న్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉం టుందన్నారు. డేటా రంగంలో ఇండియాలో నెంబర్ వన్‌గా నిలవాలన్న తమ ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ సెంటర్ ఉంటుదన్నారు.