Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: అంతర్జాతీయ ఆరోగ్యసంరక్షణ కంపెనీ అబాట్ నేడిక్కడ ఆధునిక తరం ట్రాన్స్ కేథటర్ ఏరోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టీఏవీఐ) సిస్టమ్ నావిటర్ ను ఆవిష్కరించింది. తద్వారా భారతదేశ ప్రజానీకానికి మినిమల్లీ ఇన్వేసివ్ ఉపకరణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అధిక లేదా తీవ్రస్థాయి సర్జికల్ రిస్క్ ఉన్న ఏరోటిక్ స్టెనోసిస్ రోగులకు ఇది ప్రయోజనం కల్పించనుంది. నావిటర్ వా ల్వ్ తో కంపెనీ టీఏవీఐ (టీఏవీఆర్ లేదా ట్రాన్స్ కేథటర్ ఏరోటిక్ వాల్వ్ రిప్లేస్ మెంట్ గా కూడా వ్యవహరిస్తారు) అధునాతన థెరపీలను వాల్వ్ చుట్టూరా బ్లడ్ లీకింగ్ ను నిరోధించే విశిష్ట డిజైన్ వంటి వినూత్నతలతో మరిం త ముందుకు తీసుకెళ్తోంది. ఈ నావిటర్ టీఏవీఐ సిస్టమ్ అనేది కంపెనీ సమగ్ర స్ట్రక్చరల్ హార్ట్ ట్రాన్స్ కేథటర్ పోర్ట్ ఫోలియోకు సరికొత్త జోడింపు. గుండె వ్యాధులకు చికిత్స అందించేందుకు గాను వైద్యులకు, రోగులకు ఇది లెస్ ఇన్వేసివ్ ఆప్షన్లను అందిస్తుంది.
ఏరోటిక్ స్టెనోసిస్ అనేది అత్యంత సాధారణ, ప్రాణాంతక హార్ట్ వాల్వ్ వ్యాధి. అది ఏరోటిక్ హార్ట్ వాల్వ్ ద్వారా మి గితా శరీరానికి జరిగే రక్త ప్రసారాన్ని పరిమితం చేస్తుంది. అది హార్ట్ ఫెయిల్యూర్ కు దారి తీసే అవకాశం ఉం టుంది. కొన్ని సందర్భాల్లో ఆకస్మకి కార్డియాక్ డెత్ లు కూడా చోటు చేసుకోవచ్చు. ఎంతో మందిలో గమనిం చదగిన లక్షణాలేవీ కనిపించవు. భారతదేశంలో 75ఏళ్లు దాటిన ప్రతీ 40 మందిలో ఒకరు తీవ్రమైన, సింప్టమా టిక్ ఏరోటిక్ స్టెనోసిస్ తో బాధపడుతున్నారు. వీరి కోసం ఓపెన్ హార్ట్ సర్జరీని పరిగణనలోకి తీసుకుంటూ ఉం టారు. అయితే, వయస్సు, ఇతర వ్యాధులు, పరిస్థితులను కలిగి ఉండడం వంటి కారణాలతో దీన్ని హై-రిస్క్ ప్రొసీజర్ గా భావిస్తుంటారు. టీఏవీఐ అనేది సర్జికల్ ఏరోటిక్ వాల్వ్ రిప్లేస్ మెంట్ కు లెస్ ఇన్వేసివ్ ఆల్టర్నేటివ్ గా పనికొస్తుంది. ఈ వ్యాధితో బాధపడే రోగులకు లక్షణాలను తగ్గిస్తుంది, జీవితాలను మెరుగు పరుస్తుంది. టీఏవీఐకి ముందుగా తీవ్రమైన ఏరోటిక్ స్టెనోసిస్ కు సర్జికల్ ఏరోటిక్ వాల్వ్ రిప్లేస్ మెంట్ అనేది ప్రామాణిక సంరక్షణగా ఉండేది. అయితే అందరికీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం సాధ్యపడదు.
ఈ సందర్భంగా ఫోర్టీస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, ఫోర్టీస్ మెడికల్ కౌన్సిల్ (న్యూదిల్లీ) చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ మాట్లాడుతూ, ‘‘ఏరోటిక్ స్టెనోసిస్ తో బాధపడుతూ, సర్జరీ చేయించుకోలేని భారతీయుల కోసం ఈ టీఈవీఐ సిస్టమ్ ఒక సురక్షిత, ప్రభావపూర్వక చికిత్స ఎంపికను అందిస్తుంది. సైజ్ రేంజెస్ అనేది రోగి నిర్దేశిత సైజింగ్ కు, ఆప్టిమల్ వాల్వ్ ఫంక్షన్ కు వీలు కల్పిస్తుంది’’ అని అన్నారు. ‘‘ట్రాన్స్ కేథటర్ వాల్వ్ రిప్లేస్మెంట్ అ నేది కొంతకాలంగా వృద్ధులైన రోగులకు ఏరోటిక్ వాల్వ్ నేరోయింగ్ తో ఒక ప్రామాణికంగా ఉంటోంది, ఈ ఉపక రణం ప్రస్తుత టీఏవీఐ సిస్టమ్స్ లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది’’ అని అన్నారు.
నావిటర్ ఒక విశిష్ట ఫ్యాబ్రిక్ కఫ్ (నవీసీల్) ను కలిగిఉంటుంది. వాల్వ్ ఫ్రేమ్ చుట్టూరా రక్తం బ్యాక్ ఫ్లో ను తగ్గిం చేందుకు లేదా పూర్తిగా అరికట్టేందుకు (పారావాల్వులర్ లీక్ గా వ్యవహరిస్తారు) కార్డియాక్ సైకిల్ తో కలసి ప ని చేస్తుంది. టీఏవీఐ ప్రొసీజర్స్ సందర్భంగా ఎదురయ్యే సాధారణ సమస్య ఇది. ఈ నూతన ఉపకర ణం ఇంట్రా – యాన్యులర్ (నేటివ్ వాల్వ్ లో) లీఫ్ లెట్స్, లార్జ్ ఫ్రేమ్ సెల్స్ తో సెల్ఫ్-ఎక్స్ పాండింగ్ టీఏవీఐ తో ఉంటుం ది. కరోనరో ఆర్టరీ డిసీజ్ (సిఎడి) కు చికిత్స అందించేందుకు గాను భవిష్యత్ ఇంటర్ వెన్షన్లకు వీలు కల్పిస్తూ, క్రిటికల్ కరోనరీ ఆర్టరీస్ కు మెరుగైన యాక్సెస్ కల్పించేందుకు తోడ్పడేలా డిజైన్ చేయబడింది. ఈ నూతన డిజైన్ అదనంగా మెరుగైన హీమోడైనమిక్స్ లేదా మెరుగైన రక్త ప్రవాహాన్ని అందిస్తుంది.
నావిటర్ ఉపకరణం అబాట్ యొక్క ఫ్లెక్స్ నవ్ డెలివరీ సిస్టమ్ తో ఇంప్లాంట్ చేయబడింది.అది స్లిమ్ డిజైన్ తో లోయెస్ట్ టీఏవీఐ డెలివరీ సిస్టమ్ ప్రొఫైల్ తో ఉంటుంది. 5.0 ఎంఎం వంటి చిన్న వెసెల్స్ తో ఉండే వారికి కూ డా చికిత్స చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ స్లిమ్ కేథటర్ స్టేబుల్, ప్రిడిక్టబుల్, అక్యురేట్ వాల్వ్ డెలివరీ, ప్లేస్ మెంట్ లకు వీలుగా వివిధ ఏరోటిక్ అనాటోమీస్ ను అకామిడేట్ చేయగలుగుతుంది.
ఈ సందర్భంగా అబాట్ ఎమర్జింగ్ ఏషియా అండ్ కొరియా జనరల్ మేనేజర్ పాయల్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘‘ఫ్లెక్స్ నవ్ డెలివరీ సిస్టమ్ తో జోడించబడిన నావిటర్ వాల్వ్ వినూత్న డిజైన్ అనేది ఫిజీషియన్లకు అనువుగా టీఏవీఐ ప్రొసీజర్లను స్రీమ్ లైన్ చేసి, సరళీకృతం చేస్తుంది. మెరుగైన వాల్వ్ ప్లేస్ మెంట్, పనితీరులలో రోగు లకు తోడ్పడుతుంది. పటిష్ఠ పరిష్కారాలతో ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వారికి తోడ్పడుతుంది. కార్డియో వాస్కులర్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర చికిత్స ఎంపికలను అందించాలనే అబాట్ కార్యాచరణలో మరో మైలురాయి ఈ వినూత్న ఉత్పాదన. రోగుల జీవన నాణ్యతలను ఇది మెరుగుపరుస్తుంది. తాము ఇష్ట పడే పనులను చేసుకునే అవకాశాన్ని ఇది వారికి అందిస్తుంది’’ అని అన్నారు.