Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విఎల్ఎస్ఐ, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ రంగంలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న మాస్‌చిప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్ తన అత్యాధునిక కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని అరబిందో గెలాక్సీలో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో దీన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఫిజికల్ డిజైన్, అనలాగ్ లేఔట్, డిజైన్ వెరిఫికేషన్, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ విభాగాల్లో ఏటా 600 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. విద్యార్థులకు మరింత మెరుగ్గా శిక్షణ ఇచ్చేందుకు ఇడిఎ టూల్ ప్రొవైడర్ కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్‌తో ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. మాస్‌చిప్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్‌ను సెమికండక్టర్ల తయారీ దిగ్గజం మాస్‌చిప్ టెక్నాలజీస్ ప్రమోట్ చేస్తోంది. ఈ కేంద్రం 2011 నుంచి వేలాది మందికి శిక్షణ ఇచ్చిందని మాస్‌చిప్ ఎండి, సిఇఒ వెంకట సింహాద్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెమికండక్టర్ కంపెనీల్లో తమ అభ్యర్థులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా పరిశ్రమకు అభ్యర్థులను అందించేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని చెప్పారు.