Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఐటి కంపెనీ టెక్ మహీంద్రా బుధవారం కొత్తగా క్లౌడ్ బ్లేజ్టెక్ను ప్రారంభించింది. దీన్ని బుధవారం హైదరాబాద్లో లాంచనంగా ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా క్లౌడ్ సేవల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. క్లౌడ్ బ్లేజ్టెక్ మౌలిక వసతుల ట్రాన్స్ఫర్మేషన్, సంస్థలకు సాయంగా నిలువనుందని టెక్ మహీంద్రా ఇన్ఫ్రా అండ్ క్లౌడ్ బిజినెస్ గ్లోబల్ హెడ్, చీఫ్ డెలివరీ ఆఫీసర్ సుధీర్ నయ్యర్ తెలిపారు. ఇతర కంపెనీలతో పోల్చితే క్లౌడ్ బ్లేజ్టెక్ సేవలు 25-30 శాతం వరకు చౌకగా లభించనున్నాయన్నారు. క్లౌడ్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్ సురి చావ్లా మాట్లాడుతూ తమ వేదిక ఖాతాదారులకు అనుగుణమైన కస్టమైజ్డ్ సేవలను అందిస్తుందన్నారు.