Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్ స్టీల్ ఎగుమతులు భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో ఈ రంగం ఎగుమతులు 55 శాతం పతనమై 43 లక్షల టన్నులకు పరిమితమయ్యాయని తెలిపింది. గ్లోబల్ డిమాండ్ పడిపోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఇదే సమయంలో భారత్ స్టీల్ దిగుమతులు 22.5 శాతం పెరిగి 38 లక్షల టన్నులుగా చోటు చేసుకోవడం గమనార్హం. గడిచిన ఎనిమిది మాసాల్లో దేశంలో స్టీల్ వినిమయం 12 శాతం పెరిగి 7.53 కోట్ల టన్నులుగా చోటు చేసుకుంది.