Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షోరూమ్ ప్రారంభించిన తెలంగాణా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్
నవతెలంగాణ హైదరాబాద్ : విద్యుత్ స్కూటర్ల రూపకల్పన, అభివృద్ధి, తయారీ రంగంలో ఉన్నటువంటి సుప్రసిద్ధ విద్యుత్ వాహన (ఈవీ) సంస్థ క్వాంటమ్ ఎనర్జీ నేడు, తెలంగాణాలో తమ మొట్టమొదటి డీలర్‌షిప్‌ను హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద ప్రారంభించింది. ఈ నూతన డీలర్‌షిప్‌ను క్వాంటమ్ ఎనర్జీ ఉన్నతాధికారుల సమక్షంలో తెలంగాణా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు.
ఈ అత్యాధునిక షోరూమ్‌లో మొత్తం శ్రేణి హై స్పీడ్ ఈవీ స్కూటర్లు – ఎలక్ట్రాటాన(Elektron), మిలన్(Milan), బిజినెస్ (Bziness) లను ప్రదర్శిస్తారు. ఈ స్కూటర్లను ఇప్పటికే మార్కెట్లో విడుదల చేశారు. వీటికి అపూర్వమైన స్పందన లభిస్తుంది. ఈ డీలర్షిప్ ఇప్పుడు పూర్తి సరికొత్త వాహనం ప్లాస్మా (Plasma)ను సైతం ప్రదర్శించనుంది. దీనిని 2023 సంవత్సరారంభంలో విడుదల చేయనున్నారు. క్వాంటమ్ ఎనర్జీ డీలర్‌షిప్‌లు నేడు సికింద్రాబాద్, వరంగల్‌లో కూడా ప్రారంభించనున్నారు. ఈ కంపెనీ తమ ఉత్పత్తులను ఒడిషా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఇప్పటికే విడుదల చేసింది.
అంతర్గత డిజైన్, అభివృద్ధితో అత్యాధునిక సాంకేతికతను భారతదేశానికి క్వాంటమ్ ఎనర్జీ తీసుకురావడంతో పాటుగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా తయారీ సామర్థ్యం సైతం తీసుకువచ్చింది. గత 50 సంవత్సరాలుగా ఆటోమోటివ్ పరిశ్రమలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన కుశలవ గ్రూప్ ఈ సంస్ధకు వెన్నంటి ఉంది. ఈ కంపెనీ ఆర్ అండ్ డీ కేంద్రం, తయారీ సదుపాయాలు తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉన్నాయి. షేర్డ్ మొబిలిటీ అయిన ప్రజా రవాణా, సంస్ధాగత రవాణా, లాజిస్టిక్స్, డెలివరీ సేవలలో ఈవీ స్వీకరణను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రజా రవాణాలో విద్యుత్ వాహనాల స్వీకరణ పెరిగితే మొత్తంమ్మీద రవాణా వ్యయం గణనీయంగా తగ్గనుంది.
తెలంగాణా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, భారతదేశాన్ని పర్యావరణ అనుకూలంగా, హరిత దిశగా తీసుకువెళ్తూ కార్బన్ ఫుట్‌ప్రింట్ గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న క్వాంటమ్ ఎనర్జీ బృందాన్ని ప్రశంసించడంతో పాటుగా అభినందించారు. భారతదేశం మరింతగా పర్యావరణ అనుకూలంగా మారేందుకు మరిన్ని విద్యుత్ వాహనాలను తయారుచేయాల్సిందిగా ఆయన కంపెనీని కోరారు. విద్యుత్ రవాణా మిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతును పునరుద్ఘాటించిన ఆయన, ఎలక్ట్రిక్ వెహికల్ మరియు ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020–2030 ( విద్యుత్ వాహనం మరియు ఇంధన నిల్వ విధానం 2020–2030)ద్వారా కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలు, బ్యాటరీల రీసైకిల్ మరియు నాశనం చేయడంలో ప్రయత్నాలనూ వెల్లడించారు.
క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ చక్రవర్తి చుక్కపల్లి మాట్లాడుతూ ‘‘తెలంగాణా రాష్ట్రంలో మా మొట్టమొదటి డీలర్షిప్ ప్రారంభించడం మరియు మా హై స్పీడ్ ఈవీ లను వినియోగదారులకు చేరువ చేయడం పట్ల సంతోషంగాఉన్నాము. పనితీరు పరంగా ఎలాంటి రాజీపడకుండా అత్యుత్తమ పరిధిని అందించేలా మా స్కూటర్లను వినూత్నమైన సాంకేతికతతో అభివృద్ధి చేశాము. భారతదేశంలో అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందుబాటు ధరలలో అందించడంపై మేము దృష్టి సారించాము. మా వాహనాలకు లభించిన ప్రోత్సాహకరమైన స్పందనతో మేము మా రెండవ ఉత్పత్తి కేంద్రంను 85వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకు 5వేల వాహనాల తయారీ సామర్ధ్యంతో ప్రారంభించాము’’ అని అన్నారు.
క్వాంటమ్ ఎనర్జీ యొక్క నాలుగు ఈవీ స్కూటర్లు – ప్లాస్మా, ఎలకా్ట్రన్, మిలన్, బిజినెస్. ఇవి విస్తృతశ్రేణిలో శక్తివంతమైన, సమర్థవంతమైన, ధరల పరంగా అందుబాటులోని ఈవీ స్కూటర్లను తమ వినియోగదారులకు అందిస్తుంది. నిర్ధిష్టమైన మోడల్స్ దగ్గరకు వస్తే, నూతన ప్లాస్మాలో 1500 వాట్ మోటర్ ఉంది. ఇది గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వాహన ప్రయాణం పరంగా చూస్తే ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. ఎలకా్ట్రన్ , మిలన్ లు 1000 వాట్ మోటర్ శక్తితో వస్తాయి. బిజినెస్ వాహనం 1200 వాట్ మోటర్ శక్తితో రావడంతో పాటుగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే విభిన్నమైన సవారీ పరిస్థితులకు అనుగుణంగా 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ ఈ–స్కూటర్లలో అత్యాధునిక లిథయం –అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి నాలుగు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతాయి. అభివృద్ధి చెందుతున్న భారతీయ ఈవీ ద్విచక్ర వాహన మార్కెట్లో తమదైన మార్కును చూపగలదని కంపెనీ ఆశిస్తుంది.
ఈ బ్యాటరీలు అత్యంత శక్తివంతమైనవని నిర్థారించడానికి బహుళ స్థాయి భద్రతా రక్షణతో కూడిన స్మార్ట్ బీఎంఎస్ శక్తిని కలిగి ఉన్నాయి. ఈ బ్యాటరీలు ఇద్దరు రైడర్లు ప్రయాణించేందుకు మరియు ఎత్తున ఉన్న రోడ్లపై ప్రయాణించేందుకు సైతం అనువుగా ఉంటాయి. బహుళ డిజైన్లు మరియు యుటిలిటీ పేటెంట్లను క్వాంటమ్ నమోదు చేసింది. ఈ స్కూటర్లకు అత్యంత కఠినమైన పరీక్షలను చేయడంతో పాటుగా భారతీయ రహదారి పరిస్ధితులలో మెరుగ్గా ప్రయాణించగలవని ధృవీకరించబడ్డాయని ఆయన వెల్లడించారు.