Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ గురుగ్రామ్: వినియోగదారు క్రెడిట్, ఉచిత క్రెడిట్ స్కోర్ ప్లాట్‌ఫామ్, డిజిటల్ మార్కెట్‌ప్లేస్ అయిన పైసాబజార్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు ఉమ్మడిగా సహ సృష్టి చేసిన “డ్యుయెట్” క్రెడిట్ కార్డ్‌ను ఇవాళ విడుదల చేశాయి. వినియోగదారుల రెండు విభిన్న అవసరాలను ఇబ్బంది లేకుండా నెరవేర్చే 2-ఇన్-1 ప్రొడక్ట్ ఈ డ్యూయెట్. ఈ క్రెడిట్ కార్డ్, కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లను, తక్షణమే బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయగలిగేలా ఆర్బీఐల్ బ్యాంక్ అందించే లైన్-ఆఫ్-క్రెడిట్‌ను అందిస్తుంది.
డ్యూయెట్ అనేది ఆర్బీఎల్ బ్యాంక్ అందిస్తున్న జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డ్, ఇది అందించే క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేకుండా ఆన్లైన్, ఆఫ్‌లైన్ కొనుగోళ్లు అన్నింటిపై ఫ్లాట్ 1 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈ కార్డ్ అందిస్తుంది. డ్యూయెట్ ప్రత్యేకంగా పైసాబజార్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండగా, ఇది ఆరంభం నుంచి చివరి వరకూ పూర్తి డిజిటల్ ప్రక్రియను కలిగి ఉంది. ఇది పైసాబజార్ అందించే నియో-లెండింగ్ ఉత్పత్తి సూట్లో భాగంగా నిలుస్తుంది. పైసాబజార్లోని పైసా ఆన్ డిమాండ్ (PoD) క్రెడిట్ కార్డ్‌ని డ్యూయెట్ భర్తీ చేస్తుంది.
ఆర్బీఎల్ బ్యాంక్, హెడ్ ఆఫ్ ప్రొడక్ట్స్ - క్రెడిట్ కార్డ్స్, ఉత్కర్ష్ సక్సేనా మాట్లాడుతూ, “పైసాబజార్‌తో ఈ భాగస్వామ్యం ద్వారా మా క్రెడిట్ ఆఫర్లను విస్తరించడానికి సంతోషిస్తున్నాము. ఇది సౌకర్యవంతమైన క్రెడిట్ ప్రొడక్ట్, అలాగే అనేక విలువ ఆధారిత ప్రతిపాదనలతో కలిపి కస్టమర్లకు మెరుగైన క్రెడిట్ కార్డ్ అనుభవాన్ని అందించడానికి ఇది మాకు సహాయం చేస్తుంది,” అన్నారు.
పైసాబజార్, సీనియర్ డైరెక్టర్, గౌరవ్ అగర్వాల్ మాట్లాడుతూ, “పైసాబజార్‌లో, ఉత్పత్తి, ప్రక్రియ, భాగస్వామ్యం ద్వారా భారీ వినియోగదారుల విభాగాలలో ఇప్పటికే ఉన్న అవసరాల అంతరాలను తీర్చడానికి మేము ఆవిష్కరణపై స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాము. RBL బ్యాంక్‌తో డ్యుయెట్, మా ప్రయాణంలో మరో అడుగు, మేము మా వినియోగదారులకు మరియు రుణ వ్యవస్థకు నిజమైన విలువను జోడించే లక్ష్యంతో, మా నియో-లెండింగ్ వ్యూహాన్ని బలోపేతం చేస్తున్నాము,” అని అన్నారు.
పరిశ్రమలో నిర్దిష్ట ఆవిష్కరణలు, సరఫరా, ప్రక్రియ అంతరాలను అధిగమంచడం కోసం, పైసాబజార్ తన నియో-లెండింగ్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. వినూత్న రుణ పరిష్కారాలను అందించడం అలాగే భౌగోళిక ప్రాంతాలు, ఆదాయ స్థాయిలు ఇంకా క్రెడిట్ ప్రొఫైల్‌లలో పెద్ద విభాగాలకు క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేయడం దీని ప్రదాన లక్ష్యం.