Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్సంగ్ భారత్‌లోని స్టార్టప్‌లకు పలు అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. తమ సంస్థ అందించే యుపిఐ, డిజిలాకర్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఒఎన్‌డిసి), ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్ మెంట్ నెట్ వర్క్ (ఒసిఇఎన్), యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ ఫేస్ తదితర టెక్నాలజీలపై సహకరించడానికి స్టార్టప్స్‌ను అహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఈ విభాగాల్లో తమ సంస్థకు స్టార్టప్‌లు అందించే పరిష్కారాలకు నిధుల సహాయాన్ని అందించనున్నట్లు తెలిపింది.
డిజిటల్ అప్లయన్సెస్‌పై 20 ఏళ్ల వారంటీ
సామ్సంగ్ ఇండియా తొలిసారి తన డిజిటల్ అప్లయన్సెస్‌పై మీద 20 ఏళ్ల వారంటీ అందిస్తున్నట్లు ఆ సంస్థ మరో ప్రకటనలో తెలిపింది. సంస్థ వాషింగ్ మెషీన్స్‌లో వాడే డిజిటల్ ఇన్వెర్టర్ మోటార్, రిఫ్రిజరేటర్స్లో వాడే డిజిటల్ ఇన్వెర్టర్ కంప్రేసర్ పైన ఈ సౌలభ్యం ఉంటుందని తెలిపింది. దీంతో తమ వినియోగదారులు మరింత నిబ్బరంగా ఉండొచ్చని పేర్కొంది.