Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థిక మాద్యం భయాలతో దిగ్గజ సంస్థలు పొదుపు చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత ఉద్యోగుల తొలగింపునపైనే దృష్టి పెడుతున్నాయి. తాజాగా ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, ఎడ్యూటెక్ సంస్థ వేదాంతులు వందలాది మంది సిబ్బందిని ఇంటికి పంపించే పనిలో పడ్డాయి. స్విగ్గీ ఈ నెలలో ఇప్పటికే 250 మందికి ఉద్వాసన పలికిందని సమాచారం. రానున్న రోజుల్లో మరింత మందిని తొలగించనుందని తెలుస్తోంది. వేదాంతు 385 మంది ఉద్యోగులను తొలగించిందని సమాచారం. ఈ సంఖ్య ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 11.6 శాతంగా ఉంది. నిధుల కొరత కారణంగా ఈ ఏడాది వేదాంతు దాదాపు 1100 మంది ఉద్యోగులను ఇంటికి పంపగా.. ప్రస్తుతం ఈ ఎడ్యుటెక్ కంపెనీలో 3,300 మంది మాత్రమే పని చేస్తున్నారు.