Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది మాసాల్లో ఒక్క లక్ష ట్రాక్టర్లను విక్రయించినట్లు సోనాలిక ట్రాక్టర్స్ వెల్లడించింది. ఇంతక్రితం ఇదే కాలం అమ్మకాలతో పోల్చితే ఏకంగా 11.2 శాతం వృద్థిని సాధించినట్లు తెలిపింది. ఇదే కాలంలో పరిశ్రమ కేవలం 8.8 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. 2017-18 నుంచి ప్రతీ ఏడాది ఒక లక్ష పైగా ట్రాక్టర్లను విక్రయిస్తున్నట్లు తెలిపింది.