Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, అమెరికాకు చెందిన సియాటెల్ విశ్వవిద్యాలయాలు కీలక ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించాయి. ఈ భాగ స్వామ్యం ఉన్నత విద్యలో తమ విద్యార్థులు, అధ్యాపకులకు సరికొత్త సృజనా త్మక అవకాశాలను సృష్టించడానికి దోహదపడుతుందని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ వైస్ చాన్స్లర్ రాజ్ కుమార్ తెలిపారు. శుక్రవారం హైదరా బాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సియా టెల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ ఎడ్వర్డో పెనాల్వర్తో కలిసి ఆయన మాట్లాడారు. తమ ఒప్పందంలో పరస్పర సహకారంతోపాటు పరిశోధన, ఉమ్మడి ప్రచురణలు, గ్రంథాలయ మార్పిడి, అధ్యయనం, బోధన, పరిశో ధన కోసం ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్పిడి తదితర అంశాలు కీలకంగా ఉంటాయని వివరించారు.