Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రజల ఆదాయ మార్గాలు పడిపోవడంతో మ్యూచువల్ ఫండ్లలోనూ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబర్లో ఒపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నికర నిధులు 75 శాతం పడిపోయి రూ.2,258 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ఎంఎఫ్ల్లో పెట్టుబడులు 21 నెలల కనిష్టానికి దిగజారాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (అంపీ) గణంకాలు తెలిపాయి. ఇంతక్రితం అక్టోబర్లో ఈ రంగంలో రూ.9,390 కోట్ల పెట్టుబడులు చోటు చేసుకున్నాయి. 2022 నవంబర్ ముగింపు నాటికి మ్యూచువల్ ఫండ్లలో అసెట్ అండర్ మేనేజిమెంట్ (ఎయుఎం) దాదాపు రూ.40 లక్షల కోట్ల మైలురాయిని చేరడం విశేషం.