Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒక వారసత్వాన్ని సృష్టించడానికి మీరు సిద్ధమేనా? భారతదేశం తరఫున ప్రపంచ వేదిక మీద అడుగుపెట్టి, దేశానికి పేరుప్రతిష్టలు సాధించడానికి ఇదొక అవకాశం. 59వ విఎల్‌సిసి & ట్రెండ్స్ లు ఫెమీనా మిస్ ఇండియా 2023ని సహ సమర్పిస్తున్నారు, దీన్ని మణిపూర్ టూరిజం, ఒఆర్ఆర్ఎ ఫైన్ జ్యువలరీ & రజ్నిగంధా పెరల్స్ కో-పవర్ చేస్తున్నారు, ఇందులో పాల్గొనడానికి ఇప్పుడు ఎంట్రీలని ఆహ్వానిస్తున్నారు.
రోల్ మోడల్స్ గా, ఆంబాసిడర్స్ గా, మహిళలు వారి పూర్తిస్థాయి సామర్థ్యాలని గ్రహించేలా సాయం చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా మిస్ ఇండియా ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ప్రభావంతో, సామాజిక ప్రభావంతో ఒక పర్యావరణాన్ని నిర్మించాలని చూస్తోంది, అది ప్రపంచస్థాయిలో భారతదేశానికి గౌరవం తెస్తుందని ఆశిస్తోంది. వ్యక్తిత్వం, ప్రత్యేకత, స్వీయ వ్యక్తీకరణని ప్రోత్సహించడం, యువతలో గణనీయమైన, ఆశావహమైన విలువని సృష్టించడం అనే భావాలని పాదుకొల్పడం ద్వారా యువతులకి సాధికరత కల్పించడానికి, వారిలో ధైర్యాన్ని చూపించడానికి, వైఖరులు మార్చడానికి అందం అనే శక్తి పనిచేస్తుందని ఫెమీనా మిస్ ఇండియా సంస్థ బలంగా నమ్ముతోంది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల విజేతలని ఒక గ్రాండ్ ఫినాలో రాత్రిలో ప్రదర్శించడానికి, 29 రాష్టాల (ఢిల్లీతో సహా), కేంద్రపాలిత ప్రాంతాల (జమ్ము కాశ్మీర్ తో సహా) సంయుక్త ప్రతినిధుల కోసం జాతీయస్థాయి వెతుకులాట ప్రారంభమైంది. ఇందుకోసం, ఈ ఎంపిక వ్యవస్థలోకి వచ్చి ఇందులో పాల్గొనడానికిగాను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దానివెంట ఐదు పట్టణాల్లో, అంటే, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, గువహతి, కొల్‌కతాల్లో జనవరి & ఫిబ్రవరి 2023లో జోనల్ ఆడిషన్లు నిర్వహిస్తారు. 30 రాష్ట్ర విజేతలు పెజెంట్ బూట్ కాంప్ లో పాల్గొంటారు, ఇక్కడ వర్క్‌షాప్‌లు, ఫోటో షూట్లు, సబ్-టైటిల్ పోటీలు, అవార్డ్స్ రాత్రి ఘనమైన కార్యక్రమాలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు, ఇవన్నీ కలిసి గ్రాండే ఫినాలే ఎక్స్ట్రావెగంజాగా మారేలా ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తారు. ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకోడం వల్ల మీకు కీర్తిప్రతిష్టలు రావడం మాత్రమేకాక, గ్లామర్, ఎంటర్టయిన్మెంట్ ప్రపంచానికి కేంద్రంగా భావించే మాక్సిమమ్ పట్టణం అయిన - ముంబైలో నివశించే అవకాశంకూడా అందివస్తుంది.
ఇంతేకాక, గ్రాండ్ ఫినాలేలో పాల్గొనేందుకు రాష్ట్ర విజేతలు సిద్ధమవడంలో మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ స్టార్ నేహా ధూపియా వారిని తీర్చిదిద్దడానికి సాయపడతారు. తన అనుబంధం గురించి మాట్లాడుతూ నేహా ధూపియా "ప్రతి ఏటా, ఫెమీనా మిస్ ఇండియా యాత్ర నన్ను తిరిగి నేర్చుకునే, అనుభవాలు సంపాదించుకునే దశకి తీసుకెళుతోంది, అవి నా జీవితాతం జ్ఞాపకం వుంటాయి. ఈ యువ రాష్ట్ర విజేతలు ప్రపంచాన్ని ఎదుర్కోడానికి సిద్ధమవుతూ, ఎంతో స్ఫూర్తితో ముందడుగేయడం నాకెప్పుడూ గొప్పగా వుంటుంది. విజయం సాధించాలన్న వారి కృత నిశ్చయం నాతోసహా అందరికీ ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగానే వుంటుంది" అన్నారు. టైమ్స్ గ్రూపు, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, మణిపూర్ ప్రభుత్వం కలిసి ఫెమీనా మిస్ ఇండియా 2023 గ్రాండ్ ఫినాలేని ఆ రాష్ట్రంలో నిర్వహించడానికి గొప్ప భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నాయి. భారతదేశపు సంస్కృతిలో వైవిధ్యత, సమగ్రతలతో అందాన్ని వేడుక చేసుకోవడం, ప్రతిభావంతులైన పాల్గొంటున్నవారిలో పోటతత్వాన్ని పెంపొందించడం ఈ సహకారాం వెనక ముఖ్యోద్దేశం. భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక పెజెంట్, ఫెమీనా మిస్ ఇండియా, మన యువ మహిళలు, వారి గొంతుని లక్షలాది మంది వినేలా చేసేందుకు ఓ వేదిక కల్పిస్తోంది. మణిపూర్ రాష్ట్రంకూడా అభివృద్ధిలో మహిళలకు సాధికారత కల్పించాలని నమ్ముతోంది. అంచేత, ఈ భాగస్వామ్యం, సహజమైన ఆలోచనలు, దృక్పథాల మేలుకలయిక. ఈ పోటీని రజ్నిగంథ పెరల్స్ కూడా కో-పవర్ చేస్తోంది, మంచివాటికి వేరే మెరుపు వుంటుంది అని నమ్ముతుంది. వారి ఉత్పత్తిని తయారు చేయడంలోకూడా ఇదే ఫిలాసఫీ వుంటుంది, ఇది చాలా ప్రత్యేకంగా ఎంచిన ఏలక్కాయ గింజలు, అత్యంత స్వచ్ఛమైన కుంకుంపువ్వు, వెండిపూతతో మంచి గుణాలతో తయారవుతుంది. మిస్ ఇండియా పెజెంట్ ఔత్సాహికులందరికీ ఇక్కడ ఓ ఉత్సాహభరిత సమాచారం. హౌస్ ఆఫ్ మిస్ ఇండియా వారి గ్రూమింగ్ స్కూల్ నుంచి ఏస్ యువర్ పెజెంట్ కోర్సు ఇప్పుడు పాల్గొంటున్నవారందరికీ, ఫెమీనా మిస్ ఇండియా 2023 పెజెంట్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో భాగంగా, ఆకర్షణీయమైన ధరకే అందుబాటులో వుంటుంది. ఆడిషన్ కి హాజరుకావడానికి, ఈ కోర్సులో నమోదు చేసుకోడం ద్వారా పెజెంట్ లో గెలిచే అవకాశాలు మెరుగుపర్చుకునేలా సిద్ధంకావడానికి ఇదొక అవకాశం.