Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ లీ హెల్త్ డొమెయిన్ కొత్తగా వాసా తులసి ప్లస్ పేరుతో దగ్గు నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఔషధం తయారీలో వైద్య పరంగా నిరూపితమైన సహజ పదార్థాలు వాము పువ్వుతోపాటు ప్రిమ్ రోజ్, తాలీస పత్రం, వస, తులసి, శొంఠి, దుష్టపు తీగ, అతి మధురం, పిప్పళ్లు, దాల్చిన చెక్క, లవంగం, నల్ల మిరియాలు, పుదీనా వాడినట్టు ఆ సంస్థ తెలిపింది. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులను వాసా తులసి ప్లస్ తొలగిస్తుందని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. ఆస్తమా, దగ్గు, జలుబు, కోరింత దగ్గు, ఈసినోఫీలియా, గొంతు నొప్పి, బొంగురు గొంతు, సైనసైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. అన్ని ప్రముఖ మందుల దుకాణాలు, లీ హెల్త్ డొమెయిన్ వెబ్సైట్, అమెజాన్లో వాసా తులసి ప్లస్ లభిస్తుందన్నారు.