Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: బీమా దిగ్గజం ఎల్ఐసీ షేర్‌కు మద్దతు లభిస్తోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజూ ఈ సూచీ రాణించింది. సోమవారం బీఎస్ఈలో 3.80 శాతం లేదా రూ. 25.55 పెరిగి రూ. 697.20కు చేరింది. ఇంట్రాడేలో రూ.671- 703 మధ్య కదలాడింది. కొనుగోళ్ల మద్దతుతో ఐదు సెషన్లలో దాదాపుగా 7 శాతం పెరిగింది. వారం తొలి రోజున సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప నష్టాలు చవి చూశాయి. సెన్సెక్స్ 51 పాయింట్లు కోల్పోయి 62, 131 వద్ద ముగి సింది. నిఫ్టీ కేవలం 0.55 పాయింట్ల లాభంతో 18,497 వద్ద నమోదయ్యింది.