Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజీ అయినా ఎఫ్టిఎక్స్ సంస్థ వ్యవస్థాపకులు శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ను బహమాస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పద రీతిలో నిధులను తరలించారనే ఆరోపణలతో ఫ్రైడ్ను అదుపులోకి తీసుకున్నట్లు బహామాస్ అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. దీని తర్వాత ఆయన్ను అమెరికాకు అప్పగించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఖాతాదారులకు సంబంధించిన 10 బిలియన్ డాలర్ల నిధులను తరలించినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఈ ఎక్సేంజీ నవంబర్ 11న దివాలా తీసిందనే రిపోర్టులతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు 6 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఇదే సమయంలో కొన్ని వందల మిలియన్ డాలర్ల నిధులను ఫ్రైడ్ అనుమానస్పద రీతిలో తరలించుకుపోయారనే రిపోర్టులు వచ్చాయి.