Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలగింపులపై సంకేతాలు
న్యూఢిల్లీ : దిగ్గజ సెర్చింజన్ గూగుల్లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ఉండొచ్చని రిపోర్టులు వస్తున్నాయి. పలువురి ఉద్యోగుల పనితీరు బాగోలేదని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొనడంతో సిబ్బంది తొలగింపులపై సంకేతాలు ఇచ్చారని భావిస్తున్నారు. దీంతో తమ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయోననే భయాల్లో వారు పడ్డారు. ఇప్పటికే గ్లోబల్ టెక్ కంపెనీలు అయినా అమెజాన్, మెటా, ట్విట్టర్ తదితర కంపెనీలు ఇటీవల వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇదే బాటలో గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ కూడా 10వేల మంది సిబ్బందికి పింక్ స్లిప్లను జారీ చేయనుందని ఇటీవల రిపోర్టులు వచ్చాయి. దీనికి తోడు పిచాయ్ హెచ్చరికలు ఆ సంస్థ ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి.