Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.450 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
నవతెలంగాణ- హైదరాబాద్
జపనీస్‌కు చెందిన తయారీ రంగ సంస్థ డైపుక్ తెలంగాణ రాష్ట్రం లో రూ.450 కోట్ల పెట్టు బడులు పెడుతున్నట్టు ప్రకటించింది. ఆటో మేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ, సొల్యూషన్స్ అందించే ఈ సంస్థ హైదరాబాద్‌లోని చందన వెల్లిలో నూతన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిం ది. దీనికి సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీ ఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందం కుదర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి కెేటీఆర్ మాట్లాడుతూ'' రూ.450 కోట్లతో యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. వచ్చే 18 నెలల్లో తయారీ కార్యకలాపాలను ప్రారంభించ నుంది. సుమారు 800 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పి ంచనుంది. ఆటోమేటెడ్ స్టోరెజ్ సిస్టమ్స్, కన్వేయర్లు సహా ఆటోమేటిక్ స్టార్టర్స్ వంటి పరికరాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ పెంచి అత్యాధునిక పరిశ్రమను స్థాపించ నుంది. మొదటి దశ విస్తరణకు రూ.200 కోట్ల ప్రణాళికాబద్ధమైన పెటు ్టబడికి ప్రణాళికలు రూపొందించింది' అని మంత్రి తెలిపారు. అనేక తయారీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయన్నారు. జపాన్ అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు వెళ్తుందన్నా రు. దండు మైలారంలో అతిపెద్ద పారిశ్రామిక పార్కు తీసుకొచ్చామన్నారు. జపాన్ తరహాలో భారత్‌లోనూ తయారీ రంగం పుంజుకోవాలన్నారు. తెలంగాణ పారిశ్రామికవేత్తలు రూపకల్పన, తయారీపై దృష్టి పెట్టాలన్నా రు. దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి తయారీ పరిశ్రమలను నెలకొల్పేలా ఆలోచనలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో తమ తయారీ సంస్థలను ఏర్పాటు చేసిన, చేయనున్న కంపెనీలు రాష్ట్రంలో ఉన్న బాసర త్రిబుల్ ఐటీ వంటి విద్యా సంస్థలతో భాగస్వాములవ్వాలని కెటిఆర్ కోరారు. భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీ వేగవంతం చేస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గరిమెళ్ల పేర్కొన్నారు.