Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలోని కంటెంట్ సృష్టికర్తలు, వృత్తి నిపుణుల కోసం తన శాన్డిస్క్ ప్రొఫెషనల్ బ్రాండ్ ద్వారా వెస్ట్రన్ డిజిటల్ కొత్త ఆవిష్కరణలను విడుదల చేసింది. కంటెంట్ క్రియేటర్లు నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో ఒకటైన-కంటెంట్ మేనేజ్మెంట్ నిర్వహణలో సహాయపడేందుకు ఈ వినూత్న స్టోరేజీ పరిష్కరణలను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతదేశంలో కొత్తగా విడుదల చేసిన ఏడు ఉత్పత్తులలో శాన్డిస్క్ ప్రొఫెషనల్ ప్రో-జి40టిఎం ఎస్ఎస్డి, జి-రైడ్TM షటిల్ ఎస్ఎస్డి, జి-డ్రైవ్TM ఎంటర్ప్రైజ్-క్లాస్ డెస్క్‌టాప్ హార్డ్ డ్రైవ్, ప్రో-డాక్ 4, 4-బే రీడర్ డాకింగ్ స్టేషన్ ఉన్నాయి.
కంటెంట్ సృష్టికర్తలు అన్ని విభాగాలలో అపూర్వమైన డేటాను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు, ఇటీవలి వెస్ట్రన్ డిజిటల్ అధ్యయనం ప్రకారం, సగటున ఒక నూతన తరపు కంటెంట్ సృష్టికర్త ఒక నెలలో 350జీబీ కంటెంట్‌ను సృష్టిస్తాడు. అయితే, ఒక సాధారణ బాలీవుడ్ సినిమాకి 200-300టీబీ2 స్టోరేజ్ అవసరం. వేగవంతమైన, డేటా-ఇంటెన్సివ్ వర్క్‌ఫ్లోలు, కంటెంట్ క్రియేటర్లు - హై-ఎండ్ స్టూడియోలలో ఉన్నా, తదుపరి పెద్ద చిత్రాన్ని రూపొందించడం లేదా ప్రాజెక్ట్ కోసం ఫుటేజీని క్యాప్చర్ చేయడం లేదా పోస్ట్-ప్రొడక్షన్ సమయంలో వీడియోలను ఎడిట్ చేయడం వంటి నిపుణులను పరిగణనలోకి తీసుకుంటే - చాలా సులభంగా, వాటిని మరింత సమర్థవంతంగా చేసే సౌకర్యవంతమైన స్టోరేజ్ పరిష్కారాలు అవసరం అవుతాయి.
శాన్డిస్క్ ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియో అధిక-పనితీరు, స్కేలబుల్ మరియు నమ్మదగిన పరిష్కారాలను అందించడంపై కేంద్రీకృతమై ఉండగా, ఇది నేటి క్రియేటర్లు తమ ఆకాంక్షలకు వాస్తవరూపం అందించేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఉత్పత్తి అసెట్లను ప్రభావవంతంగా, విశ్వసనీయంగా నిర్వహించేందుకు సహాయపడేందుకు- సేకరణ, బదిలీ చేయడం నుంచి ఎడిటింగ్, ఆర్కైవింగ్ వరకు ఉత్పత్తిలోని ప్రతి దశలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వెస్ట్రన్ డిజిటల్ ఇండియా, మిడిల్ ఈస్ట్, టీఐఏ, సీనియర్ డైరెక్టర్-మార్కెటింగ్ జగన్నాథన్ చెల్లయ్య మాట్లాడుతూ, “టెక్నాలజీ ద్వారా వ్యక్తీకరించబడిన కంటెంట్ సృష్టికర్త రూపొందించిన డిజిటల్ కంటెంట్‌కు గళమని వెస్ట్రన్ డిజిటల్ విశ్వసిస్తుంది. క్యాప్చర్ చేసిన లేదా సృష్టించిన కంటెంట్‌ని సేవ్ చేయడం, బదిలీ చేయడం, ఆఫ్‌లోడ్ చేయడం, షేర్ చేయడం, ఆర్కైవ్ చేయడం వంటివి చేయాలి. మేము కొత్తగా ప్రవేశపెట్టిన శాన్డిస్క్ ప్రొఫెషనల్ బ్రాండ్ కంటెంట్ సృష్టికర్తలు, నిపుణులను ‘క్రియేట్ ది ఇన్క్రెడిబుల్’ చేసేందుకు వీలు కల్పిస్తుంది. శాన్డిస్క్ ప్రొఫెషనల్ ఆ ప్రక్రియలో ప్రతి దశను సమన్వయం చేసేందుకు ద్దేశించిన-నిర్మిత స్టోరేజ్ పరిష్కారాల శ్రేణిని అందిస్తుంది’’ అని వివరించారు.
వెస్ట్రన్ డిజిటల్ ఇండియా సేల్స్ సీనియర్ డైరెక్టర్ ఖలీద్ వానీ మాట్లాడుతూ, ‘‘వెస్ట్రన్ డిజిటల్లో, అసాధారణమైన వాటిని క్యాప్చర్ చేసేందుకు చేసే ప్రక్రియ ప్రతి దశలో క్రియేటర్లకు సహాయపడేందుకు మేము నిరంతరం ఆవిష్కరణలు చేస్తున్నాము మరియు స్టోరేజ్ పరిష్కారాలను పరిచయం చేస్తున్నాము. శాన్డిస్క్ ప్రొఫెషనల్ బ్రాండ్ క్రింద మా ప్రొఫెషనల్-గ్రేడ్ పోర్ట్‌ఫోలియో వృద్ధి చెందుతున్న క్రియేటర్ల సంఘానికి ప్రీమియం పరిష్కారాలను అందించేందుకు మాకు అవకాశాన్ని కల్పిస్తుంది’’ అని తెలిపారు. వృత్తిపరమైన కంటెంట్ స్థిరమైన మార్పులతో కొనసాగుతూ ఉంటుంది. శాన్డిస్క్ ప్రొఫెషనల్ బ్రాండ్ ప్రొఫెషనల్-గ్రేడ్ పనితీరు మరియు ఎంటర్ప్రైజ్-క్లాస్ విశ్వసనీయతతో కంటెంట్ సృష్టి ప్రక్రియల ప్రతి దశను సమన్వయం చేసేందుకు ఉద్దేశించిన-నిర్మిత స్టోరేజ్ పరిష్కారాల శ్రేణిని అందిస్తుంది.
ముఖ్య లక్షణాలు:
శాన్డిస్క్ ప్రొఫెషనల్ ప్రో-జి40 ఎస్ఎస్డి
నేడు వ్యక్తులు డేటాను క్రియేట్, భాగస్వామ్యం చేసే విధానాల ప్రేరణతో రూపొందిన ప్రో- జి40 ఎస్ఎస్డి అనేది ఇప్పటి వరకు కంపెనీ అందిస్తున్న అత్యంత దృఢమైన ఆఫర్ కాగా, ఇది అధిక-స్థాయి ఐపి68 రేటింగ్‌తో ఉండగా, వృత్తి నిపుణులు తమ పని లేదా దృష్టిని ఎక్కడికి వెళ్లినా పనిలో మమేకం అయ్యేలా చేస్తుంది.
కొత్త ఆఫర్ థండర్‌బోల్ట్™ (40Gbps) ఇంటర్ఫేస్తో 2700MB/s3 రీడ్3, 1900MB/s రైట్3 వరకు అత్యంత వేగవంతమైన వేగాన్ని కలిగి ఉంటుంది. ఇది 30 సెకన్లు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో 50జిబి వరకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అత్యంత డిమాండ్ ఉన్న పనిభారంలోనూ చక్కని శక్తియుతంగా పని చేస్తుంది. కూల్ అల్యూమినియం కోర్ కాలక్రమేణా సూపర్-ఫాస్ట్ బదిలీ వేగాన్ని నిర్వహించేలా సహాయపడేందుకు అంతర్గత డ్రైవ్ నుంచి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఒకే పోర్ట్ ద్వారా థండర్‌బోల్ట్ 3 (40జీబీపీఎస్), యుఎస్బి 3.2 జెన్ 2 (10జీబీపీఎస్) హోస్ట్‌లతో డ్యూయల్-మోడ్ అనుకూలతలో, ఆయా పరికరాల పరిధిలో గరిష్ట సామర్థ్యపు మద్దతు సరళంగా అందిస్తుంది.
ప్రో-జి40 ఎస్ఎస్డి ప్రో-గ్రేడ్ ఎన్క్లోజర్ను కలిగి ఉండడంతో, అది ఎలాంటి అడ్వెంచర్‌కు అయినా సిద్ధంగా ఉంటుంది. మీరు అనుభూతి చెందగల ప్రీమియం బలాన్ని అందిస్తుంది. ఐపి68 డస్ట్/వాటర్ రెసిస్టెన్స్, 4000-పౌండ్ (1800 కిలోలు) వరకు క్రష్ రెసిస్టెన్స్ మరియు 3-మీటర్ల డ్రాప్ రెసిస్టెన్స్‌తో తన అల్ట్రా-రగ్డ్ డిజైన్ అల్ట్రా-మన్నిక కోసం దాదాపు ప్రతి ప్రాంతంలోని మూలకాలను తట్టుకోవడంలో సహాయపడుతుంది.
ప్రో-జి40 ఎస్ఎస్డి భారతదేశంలో 5 ఏళ్ల పరిమిత వారంటీతో ఎంఎస్ఆర్పీ ప్రారంభ ధర రూ.34,999లో ఇప్పుడు అందుబాటులో ఉంది. శాన్డిస్క్ ప్రొఫెషనల్ జి-రైడ్ షటిల్ ఎస్ఎస్డి
జి-రైడ్ షటిల్ ఎస్ఎస్డి అనేది థండర్‌బోల్ట్™ 3 (40జీబీపీఎస్) మరియు యూఎస్బి-C™ (10జీబీపీఎస్) ఇంటర్ఫేస్లతో ట్రాన్స్పోర్ట్ చేయగల 8-బే హార్డ్‌వేర్ రైడ్ ఎస్ఎస్డి పరిష్కారం కాగా, ఇది కంటెంట్ నిపుణులకు భారీ సామర్థ్యాన్ని అందిస్తోంది.
4కె, 8కె, వీఆర్, అధిక డైనమిక్ పరిధి (హెచ్‌డిఆర్), మరియు అధిక ఫ్రేమ్ రేట్ (హెచ్‌ఎఫ్‌ఆర్) ఫుటేజీని ఒకే లొకేషన్లో బదిలీ చేసేందుకు గరిష్టంగా 32టీబీ5 వరకు అధిక-పనితీరు గల సాలిడ్-స్టేట్ స్టోరేజ్ ఉంటుంది. 2800ఎంబీ/ఎస్3 రీడ్ వరకు బదిలీ రేట్లు థండర్‌బోల్డ్3 ద్వారా అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. ఆన్-సైట్ ప్రొడక్షన్ లొకేషన్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ కోసం స్టూడియోకి మధ్య సులభమైన ప్రయాణానికి అనుగుణంగా నిర్మించారు. డ్యూయల్ థండర్‌బోల్ట్ 3 పోర్ట్‌లు మీకు ఐదు అదనపు పరికరాల వరకు డైసీ చైన్‌కి అనుమతిస్తాయి. జి-రైడ్ షటిల్ ఎస్ఎస్డి భారతదేశంలో 5 ఏళ్ల పరిమిత వారంటీతో ఎంఎస్ఆర్పి ప్రారంభ ధర రూ.3,99,999లో ఇప్పుడు అందుబాటులో ఉంది.
శాన్డిస్క్ ప్రొఫెషనల్ జి-డ్రైవ్ ఎంటర్ప్రైజ్-క్లాస్ డెస్క్‌టాప్ హార్డ్ డ్రైవ్
బహుముఖ యూఎస్బీ-సి (10జీబీపీఎస్) ఇంటర్ఫేస్తో కూడిన జి-డ్రైవ్ ఎంటర్ప్రైజ్-క్లాస్ డెస్క్‌టాప్ హార్డ్ డ్రైవ్, మీ కంటెంట్‌కి వేగవంతమైన బ్యాకప్ మరియు యాక్సెస్ కోసం సరైన ప్రీమియం, స్టైలిష్ డిజైన్‌లో అత్యంత విశ్వసనీయమైన, అధిక సామర్థ్యం గల నిల్వను అందిస్తుంది. యుఎస్బి-సి (10జీబీపీఎస్) పోర్ట్‌ని ఉపయోగించి 280ఎంబి/ఎస్ రీడ్3 మరియు 280ఎంబి/ఎస్ రైట్3 (22టీబీ సామర్థ్యం) వరకు వేగవంతమైన డేటా బదిలీలతో మీ అన్ని హెచ్డి ఫోటోలు, వీడియోలు మరియు సంగీతాన్ని వేగంగా బ్యాకప్ చేయండి లేదా మీ కంప్యూటర్‌కు అదనపు స్టోరేజ్‌ను జోడించండి.
మీ అన్ని డిమాండ్ పనిభారాలు, మిషన్-క్లిష్టమైన కంటెంట్ కోసం, లోపల 7200ఆర్పిఎం అల్ట్రాస్టార్® ఎంటర్ప్రైజ్-క్లాస్ హార్డ్ డ్రైవ్‌ల శక్తి, మెరుగైన విశ్వసనీయతపై మీరు ఆధారపడవచ్చు. జి-డ్రైవ్ ఎంటర్ప్రైజ్-క్లాస్ డెస్క్‌టాప్ హార్డ్ డ్రైవ్ 4టీబీ, 6టీబీ, 12టీబీ, 18టీబీ, 22టీబీ కెపాసిటీలలో అందుబాటులో ఉండగా, ధర రూ.19,999/- నుంచి ప్రారంభమవుతుంది మరియు 3 ఏళ్ల పరిమిత వారంటీతో లభిస్తుంది.
శాన్డిస్క్ ప్రొఫెషనల్ ప్రో-డాక్ 4
ఒక కొత్త విప్లవాత్మక 4-బే రీడర్ డాకింగ్ స్టేషన్, ఇది మల్టీ-కెమెరా ప్రొడక్షన్లలో క్లిష్టమైన సమయం, డబ్బును ఆదా చేసే నిజమైన స్కేలబుల్ ఆఫ్‌లోడింగ్ సొల్యూషన్‌తో బ్రిడ్జ్ క్యాప్చర్ మరియు ఇంజెస్ట్ చేయగలదు. మీ కంప్యూటర్ను డ్రైవ్‌లు, డిస్ప్లేలు, రీడర్లు, ఏ/వీ పరికరాలకు కనెక్ట్ చేయడం ద్వారా మీ వర్క్‌ఫ్లోను సులభం చేసుకోండి. త్వరగా, ఏకకాలంలో గరిష్టంగా 4 విభిన్న శాన్డిస్క్ ప్రొఫెషనల్ ప్రో-రీడర్ పరికరాలను ఆఫ్‌లోడ్ చేయండి (విడిగా విక్రయించబడింది).
వేగవంతమైన డేటా బదిలీలు, డైసీ-చైనింగ్, పవర్ డెలివరీ కోసం థండర్‌బోల్ట్ (40జీబీపీఎస్) కనెక్టివిటీతో మీ ఉత్పాదకతను మెరుగుపరుచుకోండి. అనుకూలీకరణ కోసం ఉత్పత్తి చేసిన, శాన్డిస్క్ ప్రొఫెషనల్ ప్రో-డాక్ 4 డాకింగ్ స్టేషన్లు మీ ప్రొడక్షన్ అవసరాలకు మద్దతుగా డిఐటి కార్ట్ లేదా ఇతర గేర్లకు జోడించబడతాయి. ప్రో-డాక్ భారతదేశంలో 3 ఏళ్ల పరిమిత వారంటీతో ఎంఎస్ఆర్పీ రూ.34,999/-కి ఇప్పుడు అందుబాటులో ఉంది.