Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : నగరంలో బాష్ కంపెనీ ఏర్పాటు చేసిన స్మార్ట్ క్యాంపస్‌ను మంత్రి కెటిఆర్ లాంచనంగా ప్రారంభించారు. రాయదుర్గం లోని సలర్పూరియా నాలేడ్జ్ పార్క్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. బుధవారం దీని ప్రారంబోత్సవం అనంతరం కెటిర్ మాట్లాడుతూ... బాష్ అతిపెద్ద కంపెనీ అని పేర్కొన్నారు. న్యూ ఏజ్ మొబైల్స్, కార్లలోనూ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ పెరుగుతోందన్నారు. ఆటోమోటివ్ రంగంలో బాష్ మరింత రాటుదేలుతుందని ఆశిస్తున్నామన్నారు. మొబిలిటీ వ్యాలీని సష్టించేం దుకు తెలంగాణ ప్రభుత్వం కషి చేస్తోందన్నారు. క్వాల్కామ్ లాంటి సెమీ కండెక్టర్ కంపెనీలు హైదరాబాద్‌లో దూసుకువెళ్తున్నాయన్నారు. మౌళిక సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదన్నారు.