Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గ్లోబల్ హెల్త్ మేనేజ్మెంట్ సంస్థ మెడిక్స్ మానసిక ఆరోగ్య సేవలను అందించే ఎంపవర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశంలో మానసిక ఆరోగ్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చే యోచనతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి. బుధవారం ఎంపవర్ ఛైర్పర్సన్ డాక్టర్ నీరజ్ బిర్లా, మెడిక్స్ గ్లోబల్ సిఇఒ, ఫౌండర్ సైగల్ అజ్మోన్ వర్య్చూవల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మానసిక ఆరోగ్య విభాగంలో అగ్రగామిగా ఉన్న ఎంపవర్లో 200 మందికి పైగా అనుభవజ్ఞులైన మానసిక ఆరోగ్య నిపుణులు ఉన్నారని పేర్కొన్నారు. వీరంతా కూడా ఎంపవర్తో భాగస్వా మ్యం చేసుకోవడంతో పాటుగా ప్రపంచ శ్రేణి, గణనీయంగా నిరూపిత జోక్యపు సాంకేతికతలను ఉపయోగిస్తారని తెలిపారు. భారతదేశంపై అధికంగా దష్టి సారించి 300మందికి పైగా డాక్టర్లను నియమించుకు న్నట్లు మెడిక్స్ తెలిపింది. ఒత్తిడి, ఆత్మన్యూనత, ఆందోళన, మూడ్ డిజార్డర్ల చుట్టూ ఉన్న అపోహలను తగ్గించే విధంగా ఈ భాగస్వామ్యం కషి చేయనుందని ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు.