Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది నవంబర్లో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) 5.85 శాతంగా నమోదయ్యింది. ఆహార పదార్థాలు, చమురు, తయారీ వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ సూచీ 21 నెలల కనిష్టానికి దిగివచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 19 నెలలు పాటు ఈ సూచీ రెండంకెల సంఖ్యలోనే నమోదయ్యింది. అక్టోబర్లో తొలిసారి 8.39 శాతానికి తగ్గగా.. గతేడాది నవంబర్లో 14.87 శాతంగా చోటు చేసుకుంది.