Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ బ్యాంక్ ప్రయివేటీకరణకు వీలుగా బిడ్ల దాఖలకు గాను గడువును పొడిగించినట్లు డిజిన్వెస్ట్మెంట్ శాఖ (దీపమ్) వెల్లడించింది. 2023 జనవరి 7 వరకు బిడ్లను నమోదుకు అవకాశం కల్పించినట్టు పేర్కొంది. తొలుత ప్రకటించిన గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం, ఎల్ఐసీకి ఐడిబిఐ బ్యాంక్లో 94.71 శాతం వాటాలున్నాయి. ఇందులో 60.72 శాతం వాటాను విక్రయానికి పెట్టింది. విదేశీ ఇన్వెస్టర్లు కూడా దీన్ని స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది.