Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లారెన్స్ సెండేల్ అగ్రో ప్రాసెసింగ్ ఇండియా (లీఫ్)తో పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 4 లక్షల పైగా రైతులకు ఆర్థిక స్వాలంబన కల్పించనున్నట్టు ఆ బ్యాంక్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని రైతులకు, వ్యవసాయ ఉత్పత్తిదారులకు పలు బ్యాంక్ సేవలను అందించనున్నట్లు తెలిపింది. ఆర్థిక సేవలు, మద్దతును అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల విజయవంతానికి కృషి చేయనున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్ఆర్బి అధికారి అనీల్ భవాని తెలిపారు.