Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో స్థానంలోకి మస్క్
న్యూయార్క్ : ప్రపంచ కుబేరుల జాబితాలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అగ్రస్థానంలోకి వచ్చారు. ఇంతకాలం ఈ స్థానంలో కొనసాగిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ రెండో స్థానంలోకి పడిపోయారని బ్లూమ్బర్గ్ బుధవారం ఓ రిపోర్టులో తెలిపింది. స్టాక్ మార్కెట్లలో కార్పొరేట్ల కంపెనీల సంపద ఆధారంగా ఈ జాబితాను తరుచుగా రూపొందిస్తారు. మస్క్ సంపద 168.5 బిలియన్ డాలర్లుగా ఉండగా.. బెర్నార్డ్ సంపద విలువ 172.9 బిలియన్ డాలర్లకు ఎగిసింది. మస్క్ వ్యక్తిగత ఆస్తుల విలువ తగ్గడంతో ఆయన రెండో స్థానానికి తగ్గారు. ట్విటర్ కొనుగోలుతో మస్క్ ఆస్తి కరిగిపోతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 107 బిలియన్ డాలర్లు (రూ.8.84 లక్షల కోట్ల)ను కోల్పోయారు.