Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వాణిజ్య పరంగా భారత్, చైనా మధ్య పరస్పర సహకార సంబంధాలు మెరుగ్గా కొనసాగుతున్నాయి. 2022 మార్చితో ముగిసిన 12 మాసాల కాలంలో ఇరు దేశాల మధ్య మొత్తం సరకుల వ్యాపారం ఏకంగా 34 శాతం పెరిగి 115.83 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9.5 లక్షల కోట్లు)గా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో 69.04 బిలియన్ డాలర్ల వ్యాపారం చోటు చేసుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉత్పత్తుల కోసం చైనా పైన ఆధారపడటం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని ఇటీవల ప్రధానీ మోడి పేర్కొన్నారు. 2020లో ఇరు దేశాల సరిహద్దు భూబాగల్లో నెలకొన్న ఆందోళన సమయంలో ఏకంగా అనేక చైనా ఉత్పత్తుల దిగుమతులపై భారీ ఆంక్షలను విధించారు. అయినప్పటికీ చైనా దిగుమతులపైనే భారత్ ఆధారపడాల్సి రావడం గమనార్హం.