Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో సుప్రసిద్ధ టెలికమ్యూనికేషన్స్ సేవల ప్రదాత భారతీ ఎయిర్టెల్ (ఎయిర్టెల్) నేడు తమ విప్లవాత్మక 5జీ సేవలను నగరంలో ప్రారంభించినట్లు వెల్లడించింది. తొలుత ఈ సేవలను నగరంలోని కీలకప్రాంతాలతో పాటుగా మెట్రో రైల్, రైల్వే స్టేషన్స్, బస్ టర్మినల్ వంటి రవాణా కేంద్రాలలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. హైదరాబాదీలు ఇప్పుడు అలా్ట్ర ఫాస్ట్ 5జీ కనెక్టివిటీని హైదరాబాద్ మెట్రో రైల్ లో ప్రయాణ సమయంలో కూడా ఆస్వాదించవచ్చు. ఎయిర్టెల్ 5జీ సేవలను ప్రయాణీకులు ఇప్పుడు సికింద్రాబాద్ మరియు కాచిగూడా రైల్వే స్టేషన్లతో పాటుగా తెలంగాణాకు చెందిన అతి పెద్ద ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్ (ఐఎస్బీటీ) ఇమ్లీబన్ బస్ డిపో వద్ద ఆస్వాదించవచ్చు.
అదనంగా, వినియోగదారులు ఎయిర్టెల్ 5జీ ప్లస్‌ను నగరంలో బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బోయినపల్లి, కొంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కోఠి, మలక్‌పేట, చార్మినార్, హబ్సిగూడా, ఉప్పల్,నాగోల్, కూకట్పల్లి, మియాపూర్ మొదలైన చోట్ల ఆస్వాదించవచ్చు, ఎయిర్టెల్ తమ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించడానికి కృషి చేస్తోంది. త్వరలోనే నగర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనుంది. ఎయిర్టెల్ 5జీ ప్లస్ అన్ని 5జీ ఫోన్లలో పనిచేస్తుంది. వినియోగదారులకు అత్యుత్తమ వేగం, మహోన్నత వాయిస్ అనుభవాలను అందిస్తుంది. 5జీ స్మార్ట్‌ఫోన్ కలిగిన వినియోగదారులు ఇప్పుడు హై స్పీడ్ ఎయిర్టెల్ 5జీ ప్లస్ ను తమ ప్రస్తుత డాటా ప్లాన్స్‌తోనే ఆస్వాదించవచ్చు. ఈ వినియోగదారులు తమ సిమ్ మార్చాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుత ఎయిర్టెల్ 4జీ సిమ్లన్నీ కూడా 5జీ సేవలను కూడా అందించే రీతిలో తీర్చిదిద్దడం జరిగింది. దశలవారీగా ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలను విస్తరించడంతో పాటుగా తమ నెట్‌వర్క్‌ను వృద్ధి చేయనుంది ఎయిర్టెల్. ఈ సేవలను ప్రారంభించడం గురించి భారతీ ఎయిర్టెల్ , ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సీఈఓ శివన్ భార్గవ మాట్లాడుతూ ‘‘ నగరంలో ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలను ప్రారంభిస్తున్నామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాము. విభిన్న రవాణా మార్గాలలో తమ అవసరాల కోసం నగర వ్యాప్తంగా ప్రయాణించే లక్షలాది మంది నగరవాసుల జీవితాలను ఇది స్పృశించనుంది. ఎయిర్టెల్ వినియోగదారులు ఇప్పుడు అలా్ట్ర ఫాస్ట్ నెట్‌వర్క్‌ను ఆస్వాదించడంతో పాటుగా ప్రస్తుతం అందుబాటులోని 4జీ వేగంతో పోలిస్తే 20–30 రెట్లు అధిక వేగంతో నెట్వర్క్ వేగాన్ని ప్రయాణ సమయాల్లో కూడా పొందవచ్చు. నగరమంతా మా సేవలను విస్తరించే క్రమంలో ఉన్నాము. ఈ సేవల ద్వారా వారు హై డెఫినేషన్ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మల్టిపల్ చాటింగ్, ఫోటోల ఇన్స్టెంట్ అప్లోడింగ్ వంటి సేవలను వారు సూపర్‌ఫాస్ట్ గా పొందవచ్చు’’ అని అన్నారు. ఎయిర్టెల్ అందిస్తున్న మొత్తం సేవలను ఎయిర్టెల్ 5జీ ప్లస్ అందిస్తుంది. అదనంగా, ఇది హై డెఫినేషన్ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మల్టిపల్ చాటింగ్, ఫోటోల ఇన్స్టెంట్ అప్లోడింగ్ వంటి సేవలను అత్యున్నత వేగంతో అందిస్తుంది. ఈ సేవల ప్రారంభంతో, ఇండియా ఇప్పుడు మరింత వేగంగా ఆర్ధికాభివృద్ధి దిశగా పయణించనుంది. ఎందుకంటే, ఎయిర్టెల్ 5జీ ప్లస్ ఇప్పుడు విద్య, ఆరోగ్యసంరక్షణ, తయారీ, వ్యవసాయం, మొబిలిటీ, లాజిస్టిక్స్ సేవలలో గణనీయమైన మార్పులను తీసుకురానుంది. గత సంవత్సర కాలంలో, 5జీ శక్తిని ఎయిర్టెల్ ప్రదర్శించింది. మనం నివశిస్తున్న విధానంతో పాటుగా వ్యాపారం చేస్తున్న తీరును 5జీ ఏ విధంగా మార్చగలదో అత్యంత శక్తివంతమైన రీతిలో నిరూపిత ఆధారితంగా ప్రదర్శించింది. భారతదేశపు మొట్టమొదటి లైవ్ 5జీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం దగ్గర నుంచి భారతదేశపు మొట్టమొదటి 5జీ శక్తివంతమైన హోలోగ్రామ్ నుంచి టీవీ కవరేజీ లేనప్పుడు ఆడిన ప్రపంచ కప్ మ్యాచ్‌ను భారతదేశంలో మొట్టమొదటి సారిగా రీక్రియేట్ చేయడం నుంచి భారతదేశపు మొట్టమొదటి 5జీ కనెక్టడ్ అంబులెన్స్ నుంచి భారతదేశపు మొట్టమొదటి 5జీ నెట్‌వర్క్‌ను బాష్‌తో ఏర్పరచి తయారీ సామర్ధ్యం వృద్ధిచేయడం వరకూ ఎయిర్టెల్ ఇప్పుడు 5జీ ఆవిష్కరణలలో ఎంతో ముందుంది.